OTT Comedy Movie: మరికొన్ని గంటల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..-veeranjaneyulu viharayatra to will be streaming from to tomorrow on etv win ott vk naresh film ott comedy movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: మరికొన్ని గంటల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Comedy Movie: మరికొన్ని గంటల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 13, 2024 02:22 PM IST

Veeranjaneyulu Viharayatra OTT: వీరాంజనేయులు విహారయాత్ర సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. రేపే (ఆగస్టు 13) స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా ఈ కామెడీ డ్రామా మూవీ నేరుగా ఓటీటీలోనే ఎంట్రీ ఇస్తోంది.

OTT Comedy Movie: మరికొన్ని గంటల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Comedy Movie: మరికొన్ని గంటల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న కామెడీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ప్రమోషన్లతో మంచి హైప్ తెచ్చుకుంది. సీనియర్ యాక్టర్ నరేశ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఇది తొలి ఫ్యామిలీ రోడ్ ట్రిప్ జానర్ మూవీ అంటూ ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్లతో వీరాంజనేయులు విహారయాత్ర రూపొందింది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీలోకే వచ్చే తరుణం ఆసన్నమైంది.

స్ట్రీమింగ్ వివరాలివే

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా రేపు (ఆగస్టు 14) ఈటీవీ విన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. అంటే అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ షురూ అవనుంది. మరికొన్ని గంటల్లోనే ఈటీవీ విన్‍లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ విన్‍లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది.

తండ్రి అస్థికలను గోవాలో కలిపేందుకు నరేశ్, ఆయన కుటుంబం చేసే జర్నీ ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నరేశ్‍తో పాటు రాగ్ మయూర్, ప్రియ వడ్లమణి, ప్రియదర్శిని, తరుణ, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలు పోషించారు. కామెడీతో పాటు ఫ్యామిలీ మధ్య ఎమోషన్స్ కూడా ఈ సిరీస్‍లో కీలకంగా ఉంటాయని ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది.

వీరాంజనేయులు విహారయాత్ర సినిమాను బాపినీడు నిర్మించారు. ఆర్‌హెచ్ విక్రమ్ సంగీతం అందించగా.. అంకూర్ సీ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి మూవీ టీమ్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్లను చేస్తోంది. ఈ మూవీలో అస్థికలకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇవ్వడం హైలైట్‍గా ఉంది.

ఆకట్టుకున్న ట్రైలర్

వీరాంజనేయులు విహారయాత్ర నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆయన చివరి కోరిక మేరకు తండ్రి అస్థికలు కలిపిందుకు గోవా వెళదామని కుటుంబ సభ్యులను నరేశ్ ఒప్పిస్తారు. అయితే, గోవా వచ్చేందుకు ముందుగా నిరాకరించే వార ఆ తర్వాత ఎట్టకేలకు పయనం అవుతారు. తన తండ్రి పాత కారులో వారు గోవాకు బయలుదేరతారు. అయితే, ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురుతాయి. రెండు లవ్ స్టోరీలు కూడా ఈ మూవీలో ఉన్నట్టు అర్థమవుతోంది. తన కుటుంబం వద్ద నరేశ్ ఏదో విషయం దాస్తున్నట్టు కూడా ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ చివర్లో ఎమోషనల్‍గా సాగింది. మొత్తంగా ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. రేపటి (ఆగస్టు 14) నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‍లో చూసేయవచ్చు.

చాలాకాలం మాట్లాడుకుంటారు: నరేశ్

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత నరేశ్ మాట్లాడారు. ఓటీటీ స్పేస్‍లో ఈ చిత్రం పెద్ద హిట్‍గా నిలుస్తుందనే నమ్మకంగా ఉందని గట్టిగా చెప్పారు. ఈ చిత్రం గురించి చాలా కాలం మాట్లాడుకుంటారని అన్నారు. “నా మాటలను రాసిపెట్టుకోండి. వీరాంజనేయులు విహారయాత్ర గురించి చాలా కాలం మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ స్ట్రీమింగ్ మొదలయ్యాక మంచి మౌత్ టాక్ వస్తుంది. కల్ట్ క్లాసిక్‍గా నిలుస్తుంది” అని నరేశ్ అన్నారు. ఈ చిత్రం చివరి అరగంట ఎమోషనల్‍గా సాగుతుందని దర్శకుడు అనురాగ్ తెలిపారు.