OTT Telugu Comedy Movie: అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott telugu comedy movie veeranjaneyulu viharayatra trailer released etv win ott to stream the movie from august 14th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Comedy Movie: అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Comedy Movie: అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 08, 2024 06:30 PM IST

OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు కామెడీ మూవీ వస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అస్తికలు కలపడానికి గోవాకు వెళ్లానుకునే చిత్రమైన ఫ్యామిలీ కథతో ఈ మూవీ రాబోతోంది.

అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Comedy Movie: అస్తికలు కలపడానికి గంగా నదికి వెళ్లడం తెలుసు కానీ.. గోవాకు వెళ్లడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడీ చిత్రమైన కాన్సెప్ట్ తోనే ఓ తెలుగు కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. తాజాగా గురువారం (ఆగస్ట్ 8) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. బ్రహ్మానందం వాయిస్ అందించిన, సీనియర్ నటుడు నరేష్ నటించిన ఈ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరాంజనేయులు విహారయాత్ర

ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఈ కామెడీ మూవీ పేరు వీరాంజనేయులు విహారయాత్ర. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చాలా రోజులుగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆ ఓటీటీ తాజాగా గురువారం ట్రైలర్ రిలీజ్ చేసింది. నరేష్, శ్రీలక్ష్మిలాంటి సీనియర్ నటీనటులు నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రహ్మానందం వాయిస్ హైలైట్ గా నిలవనుంది.

నవ్విస్తూ ఏడిపించేసిన ట్రైలర్

వీరాంజనేయులు విహారయాత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సుమారు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మొదట నవ్విస్తూ మొదలైనా.. చివర్లో ఎమోషనల్ చేసేసింది. ప్రియాతి ప్రియమైన నా కుటుంబ సభ్యులందరికీ వీరాంజనేయులు రాయునది.. నా చివరి కోరికగా.. నా అస్తికలను గోవాలో కలుపుతారని ఆశిస్తున్నాను అనే బ్రహ్మానందం వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.

అస్తికలు ఏ గంగలోనో కలుపుతారు కానీ.. గోవాలో కలపడం ఏంటన్న ఆసక్తి మొదట్లోనే ఈ ట్రైలర్ కలిగిస్తుంది. తన తండ్రి చివరి కోరికను నెరవేర్చడానికి తన కుటుంబంతో కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తాడు ఇంటిపెద్ద నరేష్. అసలు ఆ లెటర్ రాసింది అతడే అని ఇంట్లో వాళ్లు సందేహపడతారు. నేను రానంటే నేను రానంటూ పిల్లలు నో చెబుతారు.

ట్రైలర్ ఒక నిమిషం పాటు సరదాగానే సాగినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కథలో వచ్చే ట్విస్టుతో సడెన్ గా ట్రైలర్ కూడా సీరియస్ గా మారిపోతుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి? తన తండ్రి అస్తికలను కలపడానికి అతడు గోవాకే ఎందుకు వెళ్లాలనుకుంటాడు? చివరికి ఈ సరదా కథకు ముగింపు ఎక్కడ అన్నది సినిమాలో చూడొచ్చు.

స్టోరీ ఇదేనా?

ఈ ట్రైలర్ ను సీనియర్ హీరో వెంకటేశ్ కూడా షేర్ చేయడం విశేషం. అస్తికలు గోవాలో కలపడం ఏంట్రా నాయనా.. ట్రైలర్ చూస్తుంటే ఫన్ బ్లాస్ట్ లా కనిపిస్తోందనే క్యాప్షన్ తో అతడు షేర్ చేశాడు. మేము ట్రెజర్ కోసం బంగ్లాకి వెళ్తే.. మీరు ఆస్తి(కలు) కోసం గోవా వెళ్తారా అంటూ మరో హీరో శ్రీవిష్ణు కూడా ఈ ట్రైలర్ షేర్ చేశాడు. అతడు ఆస్తి అనే హింట్ ఇవ్వడం చూస్తుంటే సినిమా మొత్తం దాని చుట్టే తిరిగేలా కనిపిస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.