Romantic Action OTT: టాలీవుడ్ హీరోహీరోయిన్ల కన్నడ మూవీ ఓటీటీలోకి వచ్చింది - హీరోయిన్ ఎయిడ్స్ బారిన పడితే
Romantic Action OTT:కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహా హీరోగా నటించిన కన్నడ మూవీ లవ్ లీ ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Romantic Action OTT: నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్‌తో పాటు తెలుగులో పలు సినిమాలు చేశాడు వశిష్ట సింహా. అతడు హీరోగా నటించిన కన్నడ మూవీ లవ్‌లీ ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ లీ మూవీలో స్టెఫీ పటేల్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో గతంలో నిన్ను తలచి, చెప్పాలని ఉంది సినిమాల్లో స్టెఫీ పటేల్ కథానాయికగా కనిపించింది.
పది కోట్ల లాభాలు...
ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీకి చేతన్ కేశవ్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీలో కన్నడ సీనియర్ యాక్టర్స్ అచ్యుత్ కుమార్ సాధుకోకిల కీలక పాత్రల్లో కనిపించారు.
గ్యాంగ్‌స్టర్ కథ...
జై (వశిష్ట సింహా) ఓ గ్యాంగ్‌స్టర్. భార్య జనని (స్టెఫీ పటేల్) తో పాటు కూతురు కోసం నేర ప్రపంచాన్ని వదిలిపెట్టి ఓ ష్యాషన్ డిజైనింగ్ కంపెనీలో జాబ్‌లో చేరుతాడు. జై పై ఉన్న కోపంతో అతడి శత్రువులు జననికి హెచ్ఐవీ ఉన్న రక్తం ఎక్కిస్తారు. భార్యను ప్రాణాలతో బతికించుకోవడం జై లండన్ వెళతాడు.
అక్కడికి కూడా జైని వెతుక్కుంటూ శత్రువులు వస్తారు. ఆ గ్యాంగ్ బారి నుంచి భార్యాపిల్లలను జై ఎలా కాపాడుతున్నాడు? హెఐవీ నుంచి జనని కోలుకుందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. లవ్ లీ మూవీ ప్రమోషన్స్‌లో కన్నడ అగ్ర నటుడు రిషబ్ శెట్టి పాల్గొన్నాడు. ట్రైలర్, టీజర్స్ యాక్షన్ అంశాలతో కన్నడ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించాయి.
నెగెటివ్ షేడ్స్‌తో...
కన్నడంలో విలన్ రోల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించాడు విశష్ట సింహా. మఫ్టీ, తగరారు, కేజీఎఫ్, కేజీఎఫ్ తో పాటు పలు కన్నడ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లో కనిపించాడు. నారప్ప మూవీతో వశిష్ట సింహా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో వెంకటేష్ కొడుకు పాత్రను పోషించాడు.
నయీమ్ డైరీస్, కళ్యాణ్ రామ్ డెవిల్‌తో పాటు పలు సినిమాలు చేశాడు. ఇటీవల రిలీజైన యేవమ్‌లో సైకో కిల్లర్‌గా కనిపించాడు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2లో విలన్‌గా విశష్ట సింహా కనిపించబోతున్నాడు. సంపత్ నంది కథను అందించిన ఈ మూవీలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
టాపిక్