Actor Naresh: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాకయ్యా: సీనియర్ నటుడు నరేశ్-i shocked and pained senior actor vk naresh responds on pawan kalyan comments on krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Naresh: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాకయ్యా: సీనియర్ నటుడు నరేశ్

Actor Naresh: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాకయ్యా: సీనియర్ నటుడు నరేశ్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 24, 2024 10:39 PM IST

Actor Naresh on Pawan Kalyan Comments: సూపర్ స్టార్ కృష్ణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నరేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రి కృష్ణపై పవన్ చేసిన కామంట్లు షాక్‍కు గురి చేశాయని ట్వీట్ చేశారు.

Actor Naresh: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాకయ్యా: సీనియర్ నటుడు నరేశ్
Actor Naresh: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాకయ్యా: సీనియర్ నటుడు నరేశ్

Actor Naresh on Pawan Kalyan: అలనాటి హీరో, సూపర్ స్టార్ దివంగత కృష్ణపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణ రాజకీయంగా విభేదించారని పవన్ అన్నారు. అయినా, కృష్ణ చిత్రాలకు ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన పార్టీ జనసేన ప్రచారంలో భాగంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కృష్ణ కుమారుడు, సీనియర్ నటుడు నరేశ్ నేడు (ఏప్రిల్ 24) స్పందించారు.

షాకయ్యా.. బాధకలిగింది

సూపర్ స్టార్ కృష్ణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను షాక్‍కు గురి చేశాయని నరేశ్ నేడు ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరినీ కృష్ణ విమర్శించలేదని పేర్కొన్నారు. కృష్ణది బంగారం లాంటి మనసు అని ట్వీట్ చేశారు.

“తన ప్రసంగంలో పవన్ కల్యాణ్.. కృష్ణ గారిని విమర్శించడం చూసి.. విని నేను షాకయ్యా. చాలా బాధపడ్డా. బంగారం లాంటి మనసుకు కృష్ణ మారుపేరుగా నిలిచారు. విలువలను పాటించిన పార్లమెంటేరియన్ ఆయన. సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు ఆయన చేసిన సేవలు చాలా అమూల్యమైనవి. ఆయన ఎప్పుడూ కూటములను మార్చలేదు. అలాగే తన రాజకీయ ప్రసంగాల్లో ఎవరినీ విమర్శించలేదు” అని నరేశ్ ట్వీట్ చేశారు.

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని నరేశ్ చెప్పారు. కృష్ణపై భవిష్యత్తులో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నట్టు మరో ట్వీట్ చేశారు.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

అయితే, సూపర్ స్టార్ కృష్ణపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏం ఇబ్బందికరంగా లేవంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని అంటున్నారు. అయితే, కృష్ణ పేరు ఎత్తాల్సిన అవసరం ఏముందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ అంశంపై సోషల్ మీడియాలో రచ్చసాగుతోంది.

సూపర్ స్టార్ కృష్ణ కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఆయన గెలుపొందారు. ఆ సమయంలో తెలుగు దేశం అధినేతగా ఉన్న ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఆయన విభేదించారు.

బిజీబిజీగా నరేశ్

ఒకప్పడు హీరోగా సినిమాలు చేసిన నరేశ్.. కొన్నేళ్లుగా సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో తన మార్క్ చూపిస్తున్నారు. చాలా చిత్రాల్లో కామెడీ టైమింగ్‍తో అదరగొడుతున్నారు. సుమారు ఏడేళ్లుగా వరుసగా చాలా చిత్రాల్లో నటించారు. గతేడాది సామజవరగమన మూవీలో నరేశ్ మరోసారి తన కామెడీతో మైమరిపించారు. ఆ మూవీలో శ్రీవిష్ణు, నరేశ్ కాంబోలోని సీన్లు హైలైట్‍ అయ్యాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు నరేశ్. ఇలా.. వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉంటున్నారు.

గతేడాది పవిత్రా లోకేశ్‍ను నరేశ్ పెళ్లి చేసుకోవడం కూడా రచ్చరచ్చగా మారింది. చాలా కాలం ఆ వివాదం నడిచింది. ఆయనకు అది నాలుగో వివాహం. ఆయన మూడో భార్య రమ్యరఘుపతి ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.