Samajavaragamana in OTT: ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న సామజవరగమన-samajavaragamana in aha ott creating new records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samajavaragamana In Ott: ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న సామజవరగమన

Samajavaragamana in OTT: ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న సామజవరగమన

Hari Prasad S HT Telugu
Aug 01, 2023 03:00 PM IST

Samajavaragamana in OTT: ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తోంది సామజవరగమన మూవీ. థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర సక్సెసైన ఈ మూవీ.. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

సామజవరగమన మూవీ ఆహా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది
సామజవరగమన మూవీ ఆహా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది

Samajavaragamana in OTT: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు.. ఆహాలో రిలీజ్ అయిన వెంటనే ఎగబడి చూసేస్తున్నారు. ఎంతలా అంటే.. ఆహా ఓటీటీలో అత్యంత వేగంగా 20 కోట్ల మినట్స్ టార్గెట్ చేరుకున్న సినిమాగా నిలిచింది.

సామజవరగమన మూవీ గత నెల 28న ఆహా ఓటీటీలోకి వచ్చింది. మూవీ ఓటీటీలో రిలీజైన తొలి 72 గంటల్లోనే 20 కోట్ల వ్యూయింగ్ మినట్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆహా ఓటీటీలో ఇంత వేగంగా ఈ టార్గెట్ అందుకున్న మరో మూవీ లేదు. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ తో సామజవరగమన మూవీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్.. రెబ్బా జాన్ అందం ప్రేక్షకులను అలరిస్తోంది. మూవీ ఆహాలోకి వచ్చిన తర్వాత తొలి నాలుగు రోజుల్లోనే 1.8 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆహాలో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

సామజవరగమన సినిమాలో హీరో శ్రీవిష్ణు, తండ్రి పాత్ర పోషించిన నరేశ్ మధ్య సన్నివేశాలు హైలైట్‍గా నిలిచాయి. సుదర్శన్ కూడా బాగా నవ్వించాడు. కామెడీ టైమింగ్‍తో ముగ్గురూ అదరగొట్టారు. హీరోయిన్ మోనికా రెబ్బా జాన్ కూడా అందం, యాక్టింగ్‍తో ఆకట్టుకుంది. ఉన్నంతసేపు వెన్నెల కిశోర్ నవ్వులు పూయించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్.. ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సామజవరగమన వచ్చింది. రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన సినిమాలోని క్లీన్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత కథనం

టాపిక్