Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు-pithapuram janasena chief pawan kalyan filed nomination in affidavit declared 114 crore assets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Apr 23, 2024, 05:59 PM IST Bandaru Satyaprasad
Apr 23, 2024, 05:59 PM , IST

  • Pawan Kalyan Affidavit : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పవన్ గత అయిదేళ్లలో రూ.114.76 కోట్లు సంపాదించగా, పన్నుల రూపంలో రూ.73.92 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తనకు రూ.64.26 కోట్లు అప్పులు ఉన్నాయని అఫిడవిట్ లో ప్రకటించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు. 

(1 / 6)

పవన్ కల్యాణ్ అప్పులు రూ.64.26 కోట్లుగా ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు, పలువురి నుంచి రూ.46 కోట్ల 70 లక్షలు అప్పు తీసుకున్నట్లు పవన్ తెలిపారు.  రూ.20 కోట్లు విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

(2 / 6)

పవన్ కల్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17.15 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చానని పవన్ తెలిపారు. 

(3 / 6)

వివిధ సంస్థలకు రూ.3.32 కోట్ల విరాళాలు అందజేసినట్లు పవన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.1 కోటి,  పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు,  తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు,  శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కు రూ.30,11,717,  పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ కు రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. 

(4 / 6)

పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు భవిష్యత్ తరాలకు ఎంతో కీలకమైనవన్నారు.  అందుకోసం టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముందుకు వెళ్తున్నామని పవన్ స్పష్టం చేశారు. 

(5 / 6)

జనసేన పార్టీ మిగిలిన పార్టీలతో సమంగా బలం పుంజుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ముందుకు వెళ్లామని పవన్ అన్నారు. మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం లాంటి 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రజా నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చిందన్నారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు