OTT Bold Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-telugu bold romantic thriller movie evol to release in aha ott on august 15 evol ott release date bold movie ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Bold Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 12, 2024 07:28 PM IST

Evol Movie OTT Release date: ఎవోల్ సినిమా నేరుగా ఓటీటీలోకే వచ్చేయనుంది. బోల్డ్ సీన్లతో ఉన్న ట్రైలర్‌తో హాట్ టాపిక్‍గా మారిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.

OTT Bold Telugu Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Bold Telugu Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

యోగి వెలగపూడి దర్శకత్వంలో ఎవోల్ సినిమా రూపొందింది. గతంలో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ వైరల్ అయింది. బోల్డ్ సీన్లు, డైలాగ్‍లతో ఈ ట్రైలర్ ఉండటంతో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ కోసం నిర్వహించిన ప్రెస్‍మీట్‍లోనూ యోగి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఈ మూవీ నిర్మాత కూడా ఆయనే. ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్ అనే ట్యాగ్‍లైన్‍తో ఎవోల్ చిత్రం రూపొందింది. లవ్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‍ను రివల్స్ చేస్తే వచ్చే (EVOL) ఎవోల్ టైటిల్‍తో ఉన్న ఈ మూవీపై క్యూరియాసిటీ ఉంది. అయితే, థియేటర్లలో కాకుండా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఎవోల్ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (ఆగస్టు 12) వెల్లడించింది. “లవ్ రివర్స్ చేయడం, గేమ్ ఛేంజ్ చేయడం. ఎవోల్ మూవీ ఆహాలో వస్తోంది” అని పేర్కొంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రీమియర్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆహా.

ఎవోల్ సినిమాలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు హీరోలుగా నటించగా.. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‍గా చేశారు. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి అమ్మాయి రిలేషన్‍లో ఉండడం, డ్రగ్స్, క్రైమ్ అంశాలతో ఈ చిత్రం రూపొందింది. దర్శక నిర్మాత యోగి వెలగపూడి ఈ చిత్రాన్ని బోల్డ్‌గా తెరకెక్కించారు.

థియేటర్లకే అనుకున్నా..

ఎవోల్ సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఆ తర్వాత ఓ ప్రెస్‍మీట్ కూడా నిర్వహించారు దర్శకుడు యోగి. ఈ మూవీలో కంటెంట్ బాగుంటుందని, హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. అయితే, ఎవోల్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఆహా ఓటీటీలో ఆగస్టు 15న స్ట్రీమింగ్‍కు రానుంది.

ఎవోల్ సినిమా ట్రైలర్ గతేడాదే వచ్చింది. ఇద్దరు స్నేహితులతో ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమలో ఉండడం, శృంగారం చేయడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఇంటిమేట్ సీన్లతో ఈ ట్రైలర్ ఉంది. అయితే, ఆ అమ్మాయి ఆ ఇద్దరిని కావాలనే ట్రాప్ చేసిందనేలా ట్రైలర్లో ఉంది. రివర్స్‌లో లవ్ స్టోరీ అంటూ మేకర్స్ క్యూరియాసిటీ కల్పించారు. ట్రైలర్ చివర్లో క్రైమ్ యాంగిల్ కూడా ఉంది. రొమాన్స్, క్రైమ్‍తో ఇంట్రెస్టింగ్‍గా సాగింది.

ఎవోల్ సినిమాను నక్షత్ర ఫిల్మ్స్ ల్యాబ్స్ ప్రొడ్యూజ్ చేయగా.. తేడా బ్యాచ్ సినిమా సమర్పించింది. ఈ చిత్రానికి కథ, డైలాగ్స్, స్క్రీన్‍ప్లే, నిర్మాత, దర్శకుడి బాధ్యతలను యోగి వెగలపూడి నిర్వర్తించారు. ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

కాగా, హీరో నవదీప్ ప్రధాన పాత్ర పోషించిన బోల్డ్ మూవీ ‘లవ్ మౌళి’ కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. అనుకున్నస్థాయిలో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. జూన్ 27వ తేదీనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు.