Love Mouli OTT Release Date: నవదీప్ బోల్డ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?-love mouli ott release date revealed aha ott to stream this bold movie from 27th june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Mouli Ott Release Date: నవదీప్ బోల్డ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Love Mouli OTT Release Date: నవదీప్ బోల్డ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jun 22, 2024 09:01 PM IST

Love Mouli OTT Release Date: టాలీవుడ్ నటుడు నవదీప్ నటించిన బోల్డ్ మూవీ లవ్ మౌళి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను శనివారం (జూన్ 22) ఆహా ఓటీటీ అనౌన్స్ చేసింది.

నవదీప్ బోల్డ్ మూవీ వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
నవదీప్ బోల్డ్ మూవీ వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Love Mouli OTT Release Date: బోల్డ్ కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు విరగబడి థియేటర్లకు వచ్చి చూసేస్తారనుకోవడం పొరపాటే అవుతుంది. దీనికి నిదర్శనం తాజాగా నవదీప్ నటించిన లవ్ మౌళి మూవీ. ఈ సినిమాను బోల్డ్ సీన్లతో నింపేశారు. అయినా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. దీంతో మూడు వారాల్లోనే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తాజాగా ఆహా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

లవ్ మౌళి ఓటీటీ రిలీజ్ డేట్

టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా ఉన్నా పెద్ద పేరు సంపాదించని నటుడు నవదీప్. మొదట్లో హీరోగా వచ్చి ఫెయిలయ్యాడు. తర్వాత సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు. తాజాగా ఇవన్నీ కాదని ఓ బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పేరు లవ్ మౌళి. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. జూన్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

లవ్ మౌళి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఆహా శనివారం (జూన్ 22) తమ ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. నిజానికి థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సరిగ్గా 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు ఈ సినిమా రెడీ అయింది.

"ప్రేమ, బంధాల గురించి మీరు బలంగా ఆలోచించేలా అతడు చేస్తాడు. ఓ హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ లవ్ మౌళి జూన 27న ప్రీమియర్స్" అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.

ఏంటీ లవ్ మౌళి మూవీ?

తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌కు ఫాంట‌సీ అంశాల‌ను మిళితం చేస్తూ ద‌ర్శ‌కుడు డిఫ‌రెంట్‌గా ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ‌, పెళ్లి విష‌యంలో యువ‌త‌రం ఆలోచ‌న‌లు, వాళ్ల‌లోని క‌న్ఫ్యూజ‌న్స్‌తో ఈ క‌థ‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర‌.

సాధార‌ణే క‌థ‌నే అయినా న‌వ‌దీప్ క్యారెక్ట‌రైజైష‌న్‌ను కొత్త‌గా రాసుకుంటూ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ల‌వ్ మౌళి సినిమాను చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌తో మౌళి ల‌వ్ స్టోరీ రొమాంటిక్‌గా సాగుతుంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీగా కాకుండా క‌థ‌లో అంత‌ర్భాగంగానే వ‌చ్చేలా ఆ సీన్స్ రాసుకున్న తీరు మెప్పిస్తుంది.

న‌టుడిగా నవ‌దీప్‌ను కొత్త కోణంలో చూపించిన మూవీ ఇది. అత‌డి లుక్‌లోనే కాకుండా న‌ట‌న‌లో వైవిధ్యం క‌న‌బ‌డింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో చ‌క్క‌టి యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. చిత్ర పాత్ర‌లో ఫంకూరి గిద్వానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. గ్లామ‌ర్‌ను పండిస్తూనే క్యారెక్ట‌ర్ ప‌రంగా ఆమె చూపించిన వేరియేష‌న్స్ మెప్పిస్తాయి. అఘోరాగా గెస్ట్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. అయితే ఇవేవీ మూవీని నడిపించలేకపోయాయి. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

WhatsApp channel