Aavesham Hindi OTT: అఫీషియల్: ఓటీటీలో హిందీలో రానున్న బ్లాక్‍బస్టర్ ఆవేశం సినిమా.. వేరే ప్లాట్‍ఫామ్‍లో..-aavesham movie set to stream in hindi on disney plus hotstar ott fahadh faasil malayalam action drama ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Hindi Ott: అఫీషియల్: ఓటీటీలో హిందీలో రానున్న బ్లాక్‍బస్టర్ ఆవేశం సినిమా.. వేరే ప్లాట్‍ఫామ్‍లో..

Aavesham Hindi OTT: అఫీషియల్: ఓటీటీలో హిందీలో రానున్న బ్లాక్‍బస్టర్ ఆవేశం సినిమా.. వేరే ప్లాట్‍ఫామ్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 22, 2024 08:32 PM IST

Aavesham in Hindi OTT: మలయాళం మూవీ ఆవేశం హిందీ డబ్బింగ్‍లోనూ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మలయాళంలో ఓ ప్లాట్‍ఫామ్‍లో ఉండగా.. హిందీలో మాత్రం వేరే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

Aavesham Hindi OTT: అఫీషియల్: ఓటీటీలో హిందీలోనూ రానున్న బ్లాక్‍బస్టర్ ఆవేశం సినిమా
Aavesham Hindi OTT: అఫీషియల్: ఓటీటీలో హిందీలోనూ రానున్న బ్లాక్‍బస్టర్ ఆవేశం సినిమా

Aavesham Movie OTT: యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజ్ అయింది. ఫాహద్ ఫాజిల్ మరోసారి తన యాక్టింగ్‍తో మ్యాజిక్ చేశారు. సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఇతర భాషల్లోనూ థియేటర్లలోకి వస్తుందని ఆశించగా.. అలా జరగలేదు. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఆవేశం సినిమా ముందుగా మలయాళం భాషలోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. కాగా, ఈ మూవీ హిందీ డబ్బింగ్‍లోనూ వచ్చేందుకు రెడీ అయింది. అయితే ప్రైమ్ వీడియో కాకుండా వేరే ప్లాట్‍ఫామ్‍లో హిందీ వెర్షన్ అడుగుపెట్టనుంది.

హాట్‍స్టార్‌లో..

ఆవేశం సినిమా హిందీ వెర్షన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై హాట్‍స్టార్ అధికారిక ప్రకటన చేసింది. హిందీ వెర్షన్ టీజర్ కూడా తీసుకొచ్చింది.

ఆవేశం హిందీ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని మొదట అంచనాలు వచ్చాయి. అయితే, సర్‌ప్రైజింగ్‍గా హాట్‍స్టార్ తీసుకొస్తోంది. జూన్ 28న హిందీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ప్రైమ్ వీడియోలో మే 9నే మలయాళంలో ఈ చిత్రం అడుగుపెట్టింది.

తమిళ వెర్షన్ కూడా సిద్ధం

ఆవేశం సినిమా తమిళ వెర్షన్ కూడా ఇప్పటికే రెడీ అయింది. సెన్సార్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారు. అయితే, తమిళ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే వస్తుందని తెలుస్తోంది. ఈ వెర్షన్ జూన్ 21నే వస్తుందని అంచనాలు వచ్చినా.. ఆలస్యమైంది. దీంతో వచ్చే వారంలోనే తమిళ వెర్షన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అవుతుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్‍పై ఇంకా క్లారిటీ రాలేదు.

ఆవేశం మూవీకి రోమాంచం ఫేమ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. యాక్షన్, కామెడీ కలబోతతో ఈ మూవీని ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించారు. ఫాహద్ ఫాజిల్ మరోసారి తన యాక్టింగ్‍తో దుమ్మురేపారు. తన మార్క్ నటనతో మూవీ నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లారు.

ఆవేశం సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. రూ.160కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. మలయాళంలో మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయిన.. ఇతర రాష్ట్రాల్లోనూ మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ మూవీ ఆ రేంజ్‍ వసూళ్లతో సూపర్ హిట్‍గా నిలిచింది. ఫాహద్‍కు హెయ్యెస్ట్ గ్రాస్ చిత్రంగా నిలిచింది.

ఆవేశం చిత్రంలో రోషన్ షానవాజ్, హిప్‍స్టర్, మిథున్ జైజయశంకర్, సాజిన్ గోపు, ముధుట్టీ, ఆశిష్ విద్యార్థి, మన్సూర్ అలీ ఖాన్, చెంబన్ వినోద్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సుషిన్ శ్యాం మ్యూజిక్ ఇచ్చారు.

కాగా, తమిళ హారర్ కామెడీ మూవీ అరణ్మనై 4 సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జూన్ 21వ తేదీన అడుగుపెట్టింది. బాక్ పేరుతో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమ్ అవుతోంది. తమిళంలో ఈ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్లను దక్కించుకుంది. సుందర్ సీ, తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సుందర్ స్వయంగా దర్శకత్వం వహించారు.

Whats_app_banner