Jio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్‌మెంట్ రీఛార్చ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఉచితం-jio top 3 entertainment recharge plans with netflix and prime video subscription offering 84 days validity ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్‌మెంట్ రీఛార్చ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఉచితం

Jio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్‌మెంట్ రీఛార్చ్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఉచితం

Anand Sai HT Telugu
Aug 13, 2024 06:00 PM IST

Jio Recharge Plans : జియో టాప్ 3 ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లలో ఉచిత నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మీరు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోను ఉచితంగా చూడాలనుకుంటే రిలయన్స్ జియో మీ కోసం కొన్ని ప్లాన్లను అందిస్తుంది. జియో టాప్ 3 ఎంటర్టైన్మెంట్ ప్లాన్ల గురించి కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లాన్లలో అర్హులైన యూజర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్లలో మీరు జియో సినిమాకి ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. జియో అందించే ఈ మూడు ప్లాన్ల గురించి తెలుసుకుందాం..

జియో రూ.1029 ప్లాన్

ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో మీరు ఇంటర్నెట్ ఉపయోగించడానికి ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఉచిత యాక్సెస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా యాక్సెస్ కూడా లభిస్తుంది.

జియో రూ.1299 ప్లాన్

ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో మీరు ఇంటర్నెట్ ఉపయోగించడానికి ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ యూజర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. దీనిలో మీరు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాల గురించి చూస్తే.. నెట్‌ఫ్లిక్స్ మెుబైల్, జియో టీవీ, జియో సినిమా యాక్సెస్ వస్తుంది.

జియో రూ.1799 ప్లాన్

జియో తన ప్లాన్‌లో 84 రోజుల వాలిడిటీని ఇస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. ఇందులో అర్హులైన యూజర్లకు అపరిమిత 5జీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.