BSNL Special Plan : జియో, ఎయిర్‌టెల్‌కు షాక్.. అతి తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ 3300జీబీ డేటా ప్లాన్!-bsnl special recharge plan get 3300gb data for just 399 rupees jio and airtel to face tough competition from bsnl ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Special Plan : జియో, ఎయిర్‌టెల్‌కు షాక్.. అతి తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ 3300జీబీ డేటా ప్లాన్!

BSNL Special Plan : జియో, ఎయిర్‌టెల్‌కు షాక్.. అతి తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ 3300జీబీ డేటా ప్లాన్!

Anand Sai HT Telugu
Aug 13, 2024 01:04 PM IST

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకర్శించేందుకు రీఛార్జ్ ప్లాన్ ధరలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంది. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ ఇచ్చేందుకు మళ్లీ రెడీ అయింది. చాలా మంది కస్టమర్లు ఈ నెట్‌వర్క్‌ వైపు మెుగ్గు చూపిస్తున్నారు. తాజాగా వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది బీఎస్ఎన్ఎల్.

బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్

ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారత టెలికాం మార్కెట్లోకి భారీగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ధరలు భారీగా పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ క్క ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. ఆకర్షణీయమైన ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల శ్రేణిని ప్రారంభించింది. దాని వ్యూహం ఇప్పటికే అమలు చేస్తోంది. కస్టమర్లను పెంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. రీఛార్జ్ ప్లాన్స్ ధరలు తగ్గింపుతో కస్టమర్ల ఆకర్షణ, నెట్‌వర్క్ ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పుకు దారి తీస్తుంది.

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ప్లాన్‌లలో ధరల పెంపుదల కారణంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ బేస్ గణనీయమైన పెరుగుదలను చూసింది. తక్కువ ధరలో ప్లాన్స్ కోసం కోసం ఎక్కువ మంది వినియోగదారులు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

4జీ, 5జీ సేవలపై ఫోకస్

అయితే ఈ ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ కేవలం బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌లపై దృష్టి పెట్టకుండా.. 4G, 5G నెట్‌వర్క్ సేవలను అందించడంలోనూ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15,000 సైట్‌లలో 4G నెట్‌వర్క్‌లు ఇన్‌స్టాల్ చేసింది. BSNL తన 4G సేవలను ఆగస్టు 15, 2024న ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. జూలై 2024లో 2.17 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కస్టమర్ల సంఖ్య 40 లక్షలకు పెరిగింది.

రూ.399కే ప్లాన్

మరింత మంది కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా BSNL ఇటీవల తన ప్రసిద్ధ 3300GB డేటా ప్లాన్ ధరను మరింత తగ్గించింది. రూ.499 ధరలో రూ.100 తగ్గించి.. రూ.399కి ప్లాన్ అందిస్తోంది. చాలా తక్కువ ధరకు డేటాను అందించడం ద్వారా ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించడానికి ఈ ప్లాన్ రూపొందించారు. రూ.399 ప్లాన్ గణనీయమైన డేటాను అందించడమే కాకుండా, వినియోగదారులకు నమ్మకమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది.

బీఎస్ఎన్ఎల్‌కు మారడం ఎలా?

ఇతర టెలికాం వినియోగదారులు బీఎస్ఎన్‌ఎల్‌కు సులభంగా మారవచ్చు. BSNLకి పోర్ట్ చేయడం ఎలా అంటే మీరు మీ మెుబైల్‌లో PORT అని టైప్ చేసి.. 1900 నంబర్‌కు సందేశాన్ని పంపాలి. ఈ సందర్భంలో మీరు UPC నంబర్ అంటే యూనిక్ పోర్టింగ్ కోడ్ పొందుతారు. ఈ కోడ్ 15 రోజులు చెల్లుబాటు అవుతుంది. మీరు ఏదైనా బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కి లేదా BSNL ఫ్రాంచైజీకి వెళ్లి అక్కడ దరఖాస్తును పూరించాలి. అప్పుడు అక్కడి ఆపరేటర్లు మీ నంబర్‌ని కొత్త సిమ్‌కి పోర్ట్ చేస్తారు. తర్వాత ఎంచక్కా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ వాడుకోవచ్చు.