Devara Jr NTR: దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చివరి షాట్ ఇదే అంటూ..-jr ntr wraps up devara shooting tweets location photo devara part 1 to release on september 27th jr ntr janhvi kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Jr Ntr: దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చివరి షాట్ ఇదే అంటూ..

Devara Jr NTR: దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చివరి షాట్ ఇదే అంటూ..

Hari Prasad S HT Telugu
Aug 14, 2024 08:12 AM IST

Devara Jr NTR: దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే విషయాన్ని చెబుతూ మంగళవారం (ఆగస్ట్ 13) రాత్రి తారక్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చివరి షాట్ ఇదే అంటూ..
దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. చివరి షాట్ ఇదే అంటూ..

Devara Jr NTR: జూనియన్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర: పార్ట్ 1. ఆర్ఆర్ఆర్ తర్వాత సుమారు రెండున్నరేళ్లుగా మరో తారక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ దేవర మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు జూనియర్ ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా లొకేషన్ లో ఉన్న ఫొటో షేర్ చేశాడు.

దేవర షూటింగ్ పూర్తి

కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మూవీ దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్ట్ 1లో తన షూటింగ్ పూర్తయినట్లు తారక్ వెల్లడించాడు. తన చివరి షాట్ ఇదే అంటూ మంగళవారం (ఆగస్ట్ 13) రాత్రి అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

"దేవర పార్ట్ 1లో నా చివరి షాట్ ఇందాకే పూర్తయింది. ఇదో అద్భుతమైన ప్రయాణం. నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమ్ ను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న రాబోతున్న శివ సృష్టించిన ఈ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వస్తే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తాను లొకేషన్ లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

వచ్చే నెలలోనే దేవర పార్ట్ 1

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే వస్తుందనుకున్న సినిమా తర్వాత అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ రెండు వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మధ్యే ఓ ఈవెంట్లో దేవర గురించి తారక్ మాట్లాడాడు. "దేవర కోసం మీ ఇన్నాళ్ల నిరీక్షణ వృథా కాదు. సినిమా రిలీజైన తర్వాత ప్రతి అభిమాని గర్వంతో కాలర్ ఎగరేసుకుంటాడు" అని తారక్ అనడం విశేషం. ఈ దేవర మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ నీల్ రిలీజ్ డేట్

ఓవైపు దేవరపై బజ్ నెలకొన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ రావడం విశేషం. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ జనవరి 9, 2026లో రిలీజ్ కాబోతోందని మేకర్స్ ఈ మధ్యే వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్ టీమ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

అటు ఇదే కాకుండా వార్ 2 మూవీతో బాలీవుడ్ లోనూ తారక్ అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతడు హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఆ మధ్య ముంబై వెళ్లి వార్ 2 సుదీర్ఘ షెడ్యూల్లో నటించి వచ్చాడు. ఈ వార్ 2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.