Devara Chuttamalle Record: రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే పాట- మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా తారక్, జాన్వీ సాంగ్!-devara movie chuttamalle song record with 25 million views in all languages jr ntr janhvi kapoor romance in chuttamalle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Chuttamalle Record: రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే పాట- మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా తారక్, జాన్వీ సాంగ్!

Devara Chuttamalle Record: రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే పాట- మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా తారక్, జాన్వీ సాంగ్!

Sanjiv Kumar HT Telugu
Aug 06, 2024 01:43 PM IST

Devara Chuttamalle Song Record In All Languages: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారి జోడీ కట్టిన సినిమా దేవరలోని చుట్టమల్లే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 5న విడుదలైన దేవర చుట్టమల్లే పాటకు అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్‌తో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది.

రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే పాట- మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా తారక్, జాన్వీ సాంగ్!
రికార్డ్ క్రియేట్ చేసిన దేవర చుట్టమల్లే పాట- మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా తారక్, జాన్వీ సాంగ్!

Jr NTR Janhvi Kapoor Devara Chuttamalle Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్ర‌పంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటించిన దేవర చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక రీసెంట్‌గా మేకర్స్ దేవర నుంచి మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఫియర్ సాంగ్..’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా సోమవారం రోజున (ఆగస్ట్ 5) దేవర సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.

‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌, అందులోని విజువ‌ల్స్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు పెద్ద ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. జాన్వీ క‌పూర్ అందం వావ్ అనిపిస్తోంది. ఇద్ద‌రి జోడీ, మ్యూజిక్‌కి త‌గిన‌ట్లు వారు వేసిన డాన్స్ మూమెంట్స్‌తో ఇంట‌ర్నెట్‌లో పాట వైర‌ల్ అవుతోంది.

హీరోపై త‌న‌కున్న ప్రేమ‌ను హీరోయిన్ చెప్ప‌ట‌మే ఈ సాంగ్‌ లక్ష్యంగా కనిపించింది. ఇదిలా ఉంటే, తాజాగా చుట్టమల్లే పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. చుట్టమల్లే పాట విడుదలైన 19 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ వ్యూస్ సాధించుకుంది. అలాగే యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ పాట. అంతేకాకుండా "ఈ సాంగ్ మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా మారిపోయిందని నిరూపితమయింది" అని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన చుట్టమల్లే పాటలోని లొకేషన్స్, తారక్-జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పాటను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. ఇందులో ఎన్టీఆర్‌, జాన్వీ జంట రొమాంటిక్‌గా క‌నిపించ‌టం అభిమానుల‌కు క‌నువిందుగా ఉంది.

బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్‌, జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ అవ‌తార్‌లో క‌నిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మ‌న‌సును హ‌త్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తూనే క‌ళ్లు తిప్పుకోనీయ‌ట్లేదు. అనిరుద్ ర‌విచందర్ సంగీత సార‌థ్యంలో చుట్టమల్లె.. పాట ఈ ఏడాది బెస్ట్ మెలోడీ సాంగ్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. శిల్పా రావ్ పాట‌ను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ కాంబోతో పాట నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరింది.

హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు.