Jr NTR: సిగ్గుండాలి మనకు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్-jr ntr comments on gurram jashuva in meelo evaru koteeswarudu video viral jr ntr new movie updates tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: సిగ్గుండాలి మనకు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Jr NTR: సిగ్గుండాలి మనకు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Jun 04, 2024 02:21 PM IST

Jr NTR About Gurram Jashuva In Meelo Evaru Koteeswarudu: సిగ్గుండాలి మనకు అంటూ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సిగ్గుండాలి మనకు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
సిగ్గుండాలి మనకు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Jr NTR Shocking Comments: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అశేష అభిమానులను సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్ అంచలంచెలుగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్‌ను సాధించాడు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

yearly horoscope entry point

ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఓ షోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సిగ్గుండాలి మనకు అని తలదించుకుని తారక్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. అయితే, ఈ మాటలు అన్నది మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో. అది కూడా ప్రముఖ కవి గుర్రం జాషువా పద్యాలకు సంబంధించిన విషయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు జునియర్ ఎన్టీఆర్.

మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పార్టిస్‌పేట్ చేసే వ్యక్తి గుర్రం జాషువ రాసిన పద్యానికి సంబంధించి ఓ ప్రశ్న వస్తుంది. కానీ, దానికి అతను సమాధానం చెప్పలేకపోతాడు. దానికి ఆన్సర్ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా తెలియదని అంటాడు. అప్పుడు ఆడియెన్స్‌లో ఉన్న 8వ తరగతి చదువుతున్న పాప ఆ క్వశ్చన్‌కు ఆన్సర్ గుర్రం జాషువా అని చెబుతుంది. అది తెలిసి తారక్ షాక్ అవుతాడు.

"మాకు 8వ తరగతిలో గుర్రం జాషువా గారిపై లెసన్స్ ఉంటాయి. మాకు స్టేట్ సెలబస్ ఉంటుంది. అందులో శతక సుధ అని పోయెమ్స్ ఉంటాయి. తెలుగు టీచర్స్ బాగా ఎక్స్‌ప్లెన్ చేస్తారు" అని ఆ పాప చెబుతుంది. దానికి "సో నీకు గుర్రం జాషువా గారని తెలుసు ఆన్సర్ ఇది" అని ఎన్టీఆర్ అడుగుతాడు. దానికి ఆ పాప "అవును తెలుసు" అని జవాబిస్తుంది.

దాంతో "సిగ్గుండాలండి మనకు" అని జూనియర్ ఎన్టీఆర్ తల దించుకుని షాకింగ్‌గా అంటాడు. దాంతో పక్కనున్న పార్టిస్‌పెంట్ పగలబడి నవ్వుతాడు. "సిగ్గుండాలండి మనకు.. ఎంబీఏ ఫైనాన్స్ చదివి ఎందుకు" అన్నట్లుగా కామెంట్ చేసి తాను కూడా తెగ నవ్వేస్తాడు తారక్. తర్వాత ఆ పాప చెప్పినదానికి క్లాప్స్ కొడతాడు.

"తల్లి ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.. నీలాంటి వయసుకు నిజంగా ఇది తెలుసు అని అంటే.. నీకు, నువ్ చదువుతున్న స్కూల్‌కు, ఇలాంటి విషయాలు నీకు చెబుతున్న నీ టీచర్స్‌కు హ్యట్యాఫ్" అని జూనియర్ ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా అభినందిస్తాడు. అనంతరం ఆ పాప తనకు చెప్పింది రాజ్యలక్ష్మీ మేడమ్, తనది తారక్ చదువుకున్న విజ్ఞాన్ స్కూల్ అని చెబుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రెండు మూడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ రెండోసారి చేస్తున్న సినిమా దేవర. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీతో బాలీవుడ్ గ్లామర్ బ్యూటి జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది.

అలాగే తారక్ కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్ హిట్ యాక్షన్ సినిమా వార్‌కు సీక్వెల్‌గా వస్తోన్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్నాడు.

Whats_app_banner