Venu Swamy Wife: నాగచైతన్యను గిఫ్ట్ కావాలని అడుగుతున్న వేణుస్వామి భార్య.. మరో వీడియో రిలీజ్
Venu Swamy Wife: వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి ఇప్పుడు నాగ చైతన్యనే గిఫ్ట్ కావాలని అడుగుతోంది. తానూ గతంలో ఓ జర్నలిస్ట్ అంటూ మీడియాను లక్ష్యంగా చేసుకొని చేసిన వీడియోకు కొనసాగింపుగా బుధవారం (ఆగస్ట్ 14) మరో వీడియో రిలీజ్ చేసింది.
Venu Swamy Wife: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మూడేళ్లలోనే విడిపోతారంటూ వాళ్ల ఎంగేజ్‌మెంట్ మరుసటి రోజే జోస్యం చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నాడు సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇప్పుడతనికి మద్దతుగా భార్య వీణ శ్రీవాణి కూడా వరుస వీడియోలు చేస్తోంది. తాజాగా బుధవారం (ఆగస్ట్ 14) రిలీజ్ చేసిన వీడియోలో ఏకంగా నాగ చైతన్యనే ఓ గిఫ్ట్ ఇవ్వమని అడగటం విశేషం.
నాగ చైతన్యను గిఫ్ట్ అడిగిన వేణు స్వామి భార్య
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంపై జోస్యం చెప్పి చిక్కుల్లో పడిన వేణు స్వామికి అతని భార్య వీణ శ్రీవాణి మద్దతుగా నిలుస్తోంది. మంగళవారం (ఆగస్ట్ 13) ఈ అంశంపై మీడియాను లక్ష్యంగా చేసుకుంటూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. 10 నిమిషాలకుపైగా ఉన్న ఆ వీడియోలో గతంలో తానూ జర్నలిస్టునే అంటూ.. ఇప్పుడీ అంశంపై కొన్ని ఛానెల్స్ అతి చేస్తున్నాయంటూ మండిపడింది.
ఇక ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. "నాగ చైతన్య, శోభితా.. కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్. నాగ చైతన్య.. నాకు మంచి గిఫ్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఏంటి? సోకాల్డ్ యోధులు అది వదిలేసి వేరే వాళ్లను టార్గెట్ చేయడం ఏంటి? నాకు గిఫ్ట్ కావాలి.. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. ఎల్వీలో ఒక చిన్న బ్యాగ్ కావాలి" అని వీణ శ్రీవాణి అనడం గమనార్హం.
భర్తకు మద్దతుగా..
భర్త వేణు స్వామిని అందరూ లక్ష్యంగా చేసుకొని తిట్టి పోస్తుండటంతో ఇప్పుడు వీణ శ్రీవాణి రంగంలోకి దిగింది. మొదట ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో చైతన్య, శోభిత విషయంలో తన భర్త ఏం చెప్పాడన్న వాటి జోలికి వెళ్లకుండా.. మీడియాను లక్ష్యంగా చేసుకొని మాట్లాడింది. అందులో కొన్నిసార్లు మీడియానే ఎలా అంచనాలు వేస్తుంది? సినిమాల రివ్యూలు, ప్రైమ్ టైమ్ న్యూస్ చర్చలు, తెలంగాణ ఉద్యమం, ప్రస్తుతం నడుస్తున్న రాజ్ తరుణ్, లావణ్య అంశం వరకు అన్నీ మాట్లాడింది.
అయితే ఈ వీడియోపై ఎంతోమంది విమర్శలు చేశారు. ఓ సెలబ్రిటీ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకోగానే వాళ్లు విడిపోతారంటూ జోస్యం చెప్పడం ఎంత వరకూ కరెక్ట్ అన్న అంశాన్ని టచ్ చేయకుండా.. దానిపై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆమె వాదించడాన్ని తప్పుబట్టారు.
వేణు స్వామి వివరణ
చైతన్య, శోభిత భవిష్యత్తుపై తాను ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వివరిస్తూ రెండు రోజుల కిందట వేణు స్వామి కూడా ఓ వీడియో రిలీజ్ చేశాడు. గతంలో తాను నాగచైతన్య, సమంత జాతకం చెప్పానని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం గురించి మాట్లాడానని వేణు స్వామి తెలిపారు. సెలెబ్రిటీల జాతకాలు చెప్పనని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానంటూ నేడు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
“మూడు రోజుల కిందట నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకాన్ని విశ్లేషించా. దానిపై చాలా తీవ్రమైన డిబేట్లు సాగుతున్నాయి. నేను ఇంతకు ముందు నాగచైతన్య, సమంత జాతకాన్ని చెప్పాను కాబట్టి.. దానికి కొనసాగింపుగా ఈ జాతకాన్ని చెప్పా. అంతేకానీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలెబ్రిటీ జాతకాలు చెప్పనని తెలిపాను. అదే మాట మీద ఉంటాను” అని వేణుస్వామి ఆ వీడియోలో తెలిపారు.