Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ జాతకం గురించి సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే!
Venu Swamy About Sobhita Dhulipala Astrology: హీరో నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాళ జాతకంపై సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటనే వివరాల్లోకి వెళితే..
Venu Swamy On Sobhita Dhulipala Astrology: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. ప్రతి సెలబ్రిటీ జాతకం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తుంటారు. ఇదివరకు సమంత, నాగ చైతన్య జాతకం చెప్పి ఇండస్టీలో తెగ హైలెట్ అయ్యారు.
షాకింగ్ కామెంట్స్
ఆ తర్వాత ఇతర సెలబ్రిటీల భవిష్యత్ చెప్పడం, పలువురు హీరోయిన్స్‌తో పూజలు చేయించడంతో వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యారు. అయితే, ఫేమ్‌తోపాటు విపరీతమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. నాగ చైతన్య సమంతకు ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడు వాళ్లు కలిసి ఉండరు, కచ్చితంగా విడిపోతారని సంచలన కామెంట్స్ చేశారు వేణు స్వామి. అప్పట్లో ఆయనపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.
వైవాహిక జీవితంపై
కొంతకాలానికి వేణు స్వామి చెప్పినట్లు సమంత, నాగ చైతన్య విడిపోయారు. తాజాగా మరో హీరోయిన్ శోభితా ధూళిపాళతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నాడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుక అనంతరం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంపై జాతకం చెబుతానని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
జాతకాల్లో షష్టాకాలు
ప్రకటించినట్లుగానే ఇవాళ శుక్రవారం (ఆగస్ట్ 9) ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి. "శోభిత ధూళిపాళ అమావాస్య రోజున జన్మించారు. ఆమెది ధనుస్సు రాశి. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న ముహుర్తం ఉత్తర నక్షత్రం. వీరిద్దరికి జాతకం ప్రకారం షష్టాకాలు వచ్చాయి" అని వేణు స్వామి తాను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పారు.
స్త్రీ వల్ల సమస్యలు
"సమంత కూడా అమావాస్య రోజున పుట్టారు. ఆమె జాతకంలో కుజ దోషం ఉంది. అలాగే కుజుడిపై శని దృష్టి ఉంది. అమావాస్య నాడే పుట్టిన శోభిత జాతకంలో కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంది. కుజుడు మీదే కాకుండా శుక్రుడు, గురుడుపై శని దృష్టి ఉంది. ఈ జాతకం ప్రకారం 2027లో వీళ్లకు గొడవలు ప్రారంభం అవుతాయి. ప్రధానంగా ఒక స్త్రీ వల్ల సమస్యలు వస్తాయి" అని వేణు స్వామి తెలిపారు.
వందకు 10 మార్కులు
"నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జాతకాలు మాత్రమే కాదు. వాళ్లు పెట్టుకున్న ముహుర్తం కూడా సరిగా లేదు. నాగ చైతన్య, శోభిత జంటకు నేను వందకు 10 మార్కులు మాత్రమే ఇస్తాను. ఇక శోభిత కెరీర్ పరంగా చూసుకుంటే 20 శాతమే ఉంది" అని వేణు స్వామి వెల్లడించారు. ఇదిలా ఉంటే, వేణు స్వామి ఇలా జాతకం చెప్పడంపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మాట తప్పిన వేణు స్వామి
ఇదివరకు ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని, టీ20 క్రికెట్‌లో టీమిండియా గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. కానీ, దానికి పూర్తి భిన్నంగా జరిగింది. దాంతో అతనిపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. అలా జరగడంతో వేణు స్వామి కూడా సోషల్ మీడియాల్లో సెలబ్రిటీలు వ్యక్తిగత జాతకాలు చెప్పను అని మాటిచ్చారు. కానీ, నాగ చైతన్యకు రెండోసారి ఎంగేజ్‌మెంట్ కావడంతో మాట మార్చి వారి వైవాహిక జీవితంపై జాతకం చెప్పారు.