Godzilla x Kong: The New Empire OTT: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే-monster film godzilla x kong the new empire ott streaming date to release on jiocinema ott hollywood ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godzilla X Kong: The New Empire Ott: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే

Godzilla x Kong: The New Empire OTT: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 10:00 PM IST

Godzilla x Kong The New Empire: ‘గార్జిల్లా వర్సెస్ కాంగ్ ది: న్యూ ఎంపైర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెంట్ లేకుండానే స్ట్రీమింగ్ చేసుకునేలా అందుబాటులోకి వస్తోంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవనుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే..

Godzilla x Kong: The New Empire OTT: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే
Godzilla x Kong: The New Empire OTT: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే

హాలీవుడ్‍లో గాడ్జిల్లా, కింగ్‍కాంగ్ చిత్రాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. వీటిపై వరుసగా చిత్రాలు వస్తున్నాయి. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గేట్టే అదరగొట్టి మంచి హిట్ అయింది. ఈ చిత్రం ఇండియాలో ఇటీవలే అమెజాన్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంగా వచ్చింది. అయితే, ఇప్పుడు జియోసినిమా ఓటీటీలో గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్‍ను ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది.

ఎప్పుడు రానుందంటే.. తెలుగులోనూ..

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ఆగస్టు 29వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా నేడు (ఆగస్టు 14) వెల్లడించింది. ఇంగ్లిష్‍, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఆగస్టు 29న స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఎపిక్ వార్ వచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ టీజర్ తీసుకొచ్చింది జియోసినిమా ఓటీటీ.

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ఇండియాలో ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. అయితే రూ.499 రెంట్‍తో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు జియోసినిమా ఓటీటీలో ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు రానుంది. జియోసినిమా ప్రీమియర్ సబ్‍స్క్రిప్షన్ ఉంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు. జియోసినిమా ప్రీమియమ్ నెల ప్లాన్ ధర రూ.29గా ఉంది.

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ గురించి..

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ చిత్రం ఈ ఏడాది మార్చి 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. గాడ్జిల్లా చిత్రాల్లో ఇది 39వది కాగా.. కింగ్ కాంగ్‍లో 13వది. మన్‍స్టర్‌వర్స్ ఫ్రాంచైజీలో ఐదో చిత్రంగా అడుగుపెట్టింది. 2021లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీకి సీక్వెల్‍గా మూడేళ్ల తర్వాత ఈ మూవీ వచ్చింది.

గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీలో రెబకా హాల్, బ్రియన్ టైర్ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కేల్ హట్లీ, అలెక్స్ ఫెర్న్స్, ఫలా చెన్, రేచల్ హౌస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆజమ్ విన్‍గార్డ్ దర్శకత్వం వహించారు. బెన్ సెరెసిన్ సినిమాటోగ్రఫీ చేశారు.

సుమారు 150 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ దాదాపు 568 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4.7 వేల కోట్లు) కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. గాడ్జిల్లా, కాంగ్ చిత్రాలకు ఉన్న క్రేజ్‍ను మరోసారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ పతాకం నిర్మించింది.

మరో హాలీవుడ్ మూవీ

జియో సినిమా ఓటీటీలో హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ ‘ది ఫాల్ గాయ్’ కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ జియోసినిమాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనుంది. గత నెలలో ‘డ్యూన్ 2’ చిత్రం కూడా జియోసినిమాలోకి వచ్చింది.