Dune 2 OTT: హాలీవుడ్ మాస్టర్‌పీస్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే-dune 2 ott streaming telugu version jio cinema release date hollywood dune two ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dune 2 Ott: హాలీవుడ్ మాస్టర్‌పీస్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే

Dune 2 OTT: హాలీవుడ్ మాస్టర్‌పీస్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే

Dune 2 OTT in Telugu: డ్యూన్ 2 సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఈ హాలీవుడ్ మాస్టర్‌పీస్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

Dune 2 OTT in Telugu: హాలీవుడ్ మాస్టర్‌పీస్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. డేట్ ఇదే

హాలీవుడ్ మూవీ ‘డ్యూన్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్టర్‌పీస్ అంటూ ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాపై ప్రశంసలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. డ్యూన్ 2 చిత్రం ఈ ఏడాది మార్చి 1న రిలీజైంది. డ్యూన్‍కు సీక్వెల్‍గా అడుగుపెట్టింది. ఈ సీక్వెల్ మూవీ కూడా అదరగొట్టింది. డ్యూన్ 2 చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

డ్యూన్ 2 సినిమా ఇండియాలో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తోంది. ఆగస్టు 1న స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలో ఆగస్టు 1న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

రెంట్ లేకుండా..

డ్యూన్ 2 చిత్రం ఇప్పటికే ఇంగ్లిష్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్‍మైషో ఓటీటీల్లో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. అయితే, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెంట్ లేకుండానే వీక్షించొచ్చు. ప్రీమియమ్ ప్లాన్ తీసుకున్న సబ్‍స్క్రైబర్లు ఎలాంటి రెంట్ లేకుండానే ఆగస్టు 1వ తేదీ నుంచి జియోసినిమాలో ఈ చిత్రం చూడొచ్చు. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్ నెలకు రూ.29గా ఉంది. ఈ ప్లాన్ తీసుకుంటే ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు.

జియోసినిమాలో ఆగస్టు 1న ఇంగ్లిష్‍తో పాటు ఆరు భారతీయ భాషల్లోనూ డ్యూన్ 2 స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో ఫుల్ హైప్ ఉన్న ఈ మూవీకి భారీగా వ్యూస్ దక్కే అవకాశం ఉంది. మొత్తంగా చాలా మంది ఎదురుచూస్తున్న డ్యూన్ 2 ఎట్టకేలకు రెంట్ లేకుండా అందుబాటులోకి రానుంది.

డ్యూన్ 2 చిత్రంలో తిమోతీ చాలమెట్, జెండియా, రెబకా ఫెర్గ్యూసన్ ప్రధాన పాత్రలు పోషించారు. జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్, డేవ్ బటిస్టా, క్రిస్టోఫర్ వాకెన్ కీలకపాత్రలు చేశారు.

డ్యూన్ 2 మూవీకి డెనిస్ విల్లేనెయువే దర్శకత్వం వహించారు. ఈ మూవీలోని డ్రామా, ఎత్తులకు పైఎత్తులు, విజువల్స్, వార్ సీక్వెన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయి. మొత్తంగా ఓ మాస్టర్‌పీస్ మూవీలా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్‍బస్టర్ అయింది.

డ్యూన్ 2 కలెక్షన్లు

డ్యూన్ 2 చిత్రం 190 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,500కోట్లు) బడ్జెట్‍తో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 711 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,940 కోట్లు) కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది.

ఇటీవలే పిల్ సిరీస్

పిల్ వెబ్ సిరీస్ ఇటీవలే జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నకిలీ మందుల మాఫియా ప్రధాన అంశంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పిల్ సిరీస్‍లో రితేశ్ దేశ్‍ముఖ్‍, పవన్ మల్హోత్రా, అన్షుల్ చౌహాన్, అక్షత్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రీవాలా ఈ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేశారు.