Drama Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన పుష్ప విలన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Drama Thriller OTT: పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ హీరోగా నటించిన కన్నడ మూవీ కోటీ బుధవారం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ...
డాలీ ధనుంజయ హీరోగా నటించిన కన్నడ మూవీ కోటీ గురువారం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోఈ డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే ఈ మూవీ రిలీజైంది. త్వరలో తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
మౌత్ టాక్‌తో...
కోటీ మూవీకి పరమేశ్వర్ గుండ్కాల్ దర్శకత్వం వహించాడు. మోక్ష కుషాల్ హీరోయిన్‌గా నటించింది. రమేష్ ఇందిర, తార, రంగాయణ రఘు కీలక పాత్రల్లో నటించారు. కన్నడ సీనియర్ హీరో దునియా విజయ్ గెస్ట్ రోల్‌లో నటించాడు. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. మౌత్ టాక్ బాగుండటం, ధనుంజయ, రమేష్ ఇందిర యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కడంతో నిదానంగా వసూళ్లను పెరిగాయి. కమర్షియల్ హిట్‌గా కొట్టే మూవీ నిలిచింది.
మిడిల్ క్లాస్ కుర్రాడి కథ...
కోటీ (డాలీ ధనుంజయ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రి దూరం కావడంతో కుటుంబ బాధ్యతలు అతడిపై పడతాయి. తండ్రి నేర్పిన సిద్ధాంతాలకు కట్టుబడి నిజాయితీగా జీవిస్తుంటాడు. కోటీ తన కుటుంబంతో డినో సావ్‌కార్ (రమేష్ ఇందిర) అనే రౌడీకి చెందిన జనతా సిటీలో అద్దెకు ఉంటాడు. తన కాలనీలో అద్దెకుండే వారి చేత క్రిమినల్ పనులు చేయిస్తుంటాడు డినో.
రౌడీ డినో చెప్పిన పనులు చేయడానికి కోటీ అంగీకరించడు. దాంతో కావాలనే కోటీకి అప్పులు క్రియేట్ చేస్తాడు డినో. వాటిని సాకుగా చూపించి కోటీని రౌడీగా మార్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుటుంబమే ప్రాణంగా బతికే కోటీ డినో శంకర్ కారణంగా రౌడీలా మారాడా? ఆ రౌడీకి ఎదురుతిరిగి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కోటీ మూవీలో యాక్షన్, ఫ్యామిలీ అంశాలతో దర్శకుడు చూపించాడు.
డబుల్ ప్రాఫిట్స్...
దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో కోటీ మూవీ తెరకెక్కింది. థియేట్రికల్ రన్‌లో పదిహేను కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది.కోటీ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పుష్ప 2లో...
డాలీ ధనుంజయ నటుడిగానే కాకుండా లిరిసిస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా సాండల్‌వుడ్‌లో రాణిస్తోన్నాడు. తెలుగులో ప్రస్తుతం పుష్ప 2తో పాటు సత్యదేవ్‌తో ఓ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు. ఇటీవల రిలీజైన విజయ్ ఆంటోనీ తుఫాన్‌లోనూ ధనుంజయ విలన్‌గా కనిపించాడు. ప్రస్తుతం కన్నడంలో నాలుగు సినిమాల్లో ధనుంజయ హీరోగా నటిస్తోన్నాడు.