Ravanasura Review: రావణాసుర మూవీ రివ్యూ - రవితేజ విలనిజం ఎలా ఉందంటే
Ravanasura Review: రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...
Ravanasura Review: ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు రవితేజ(Ravi Teja). ఈ బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ హీరోగా నటించిన సినిమా రావణాసుర. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel), మేఘా ఆకాష్(Megha Aakash), దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైన రావణాసురతో రవితేజ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా? గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటోన్న దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
జూనియర్ లాయర్ కథ...
రవీంద్ర (రవితేజ) ఓ జూనియర్ లయర్. మాజీ ప్రియురాలు అయిన క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తోంటాడు. ఫార్మా కంపెనీ సీఈఓ హరిక (మేఘా ఆకాష్) తండ్రి (సంపత్‌రాజ్) ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. ఆ కేసును రవీంద్ర సహాయంతో కనకమహాలక్ష్మి చేపడుతుంది.
ఆ తర్వాత హారికతో పాటు సిటీలోని మరికొందరుప్రముఖులు హత్యలకు గురవుతారు. ఈ హత్యలకు రవీంద్రతో ఎలాంటి సంబంధం ఉంది? ఈ సీరియల్ మర్డర్స్ లో సాకేత్ (సుశాంత్) పాత్ర ఏమిటి? ఈ మర్డర్ మిస్టరీని ఏసీపీ హనుమంతరావు (జయరాం) ఎలా ఛేదించాడు? రవీంద్ర కుటుంబ సభ్యుల మరణానికి హరిక ఎలా కారణమైంది? అన్నదే(Ravanasura Review) ఈ సినిమా కథ.
రివేంజ్ థ్రిల్లర్...
క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్‌గా రావణాసుర సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఓ క్రిమినల్ లాయర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే రావణాసుర కథ. సింపుల్ స్టోరీకి రొమాన్స్, కామెడీతో పాటు థ్రిల్‌ను జోడించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను మలిచారు.
నెగెటివ్ షేడ్స్...
గతంలో హీరో అంటే మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా చూపించేవారు దర్శకులు. ఇప్పుడా ట్రెండ్ మారింది. హీరోలను ఎంత ఎక్కువ నెగెటివ్ షేడ్స్‌లో చూపిస్తే అంత హీరోయిజం పడుతుందనే ఫిక్స్ అయిపోయారు.
ఈ సినిమాలో సుధీర్‌వర్మ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకు రవితేజ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లోనే చూపించారు. నెగెటివ్ రోల్‌లో రవితేజ మేనరిజమ్స్, యాక్టింగ్ కొత్తగా ఉన్నాయి. కొత్తగా కనిపించారు.
కొత్తదనం మిస్...
ఇలాంటి రివేంజ్ ఫార్ములాతో తెలుగులో వందలాది సినిమాలు వచ్చాయి. ఈ స్టోరీకి ప్రోస్థటిక్ మేకప్ అంటూ కొత్తదనాన్ని తీసుకురావాలని అనుకున్నాడు డైరెక్టర్. కానీ ఆ పాయింట్ ఎగ్జైటింగ్‌గా లేదు. మర్డర్ వెనుకున్న ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ రొటీన్‌గా సాగింది. మరోవైపు జయరామ్ ఇన్వేస్టిగేషన్ లాజిక్‌లెస్‌గా సాగుతుంది.
ఐదుగురు హీరోయిన్లు ఉన్నా ఎవరి క్యారెక్టర్‌గా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. రొమాంటిక్ ట్రాక్‌లు ఆకట్టుకోవు. రెండు పాటలు ఉన్నా సందర్భం లేకుండా వచ్చి ఇబ్బంది పెడుతాయి.
రవితేజ యాక్టింగ్ హైలైట్...
రవీంద్ర అనే లాయర్ పాత్రలో రవితేజ అదరగొట్టాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే విలనిజాన్ని పండించాడు. ప్రోస్థటిక్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో సుశాంత్ నటన బాగుంది. ఐదుగురు హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లాకే కాస్త మంచి పాత్ర దక్కింది. ఆమె కామెడీ పర్వాలేదనిపిస్తుంది. మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యతలేదు.
Ravanasura Review-రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రమే...
రావణాసుర అవుట్‌డేటెడ్ పాయింట్‌తో తెరకెక్కించిన రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రవితేజ యాక్టింగ్ మినహాయిస్తే ఈ సినిమాలో కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. రవితేజ ఫ్యాన్స్‌ను మెప్పించే అవకాశం ఉంది.