Orange Peels: నారింజ తొక్కలను పడేయకుండా ఇలా పొడిచేసి వాడండి, వంటలకు ఎంతో రుచి, మంచి రంగు
Orange Peels: నారింజ తొక్కలను ఎంతోమంది బయటపడేస్తూ ఉంటారు. నిజానికి వాటిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఇక్కడ మేము నారింజ తొక్కలను ఎన్ని రకాలుగా వంటల్లో ఉపయోగించవచ్చో చెప్పాము.
నారింజ పండ్ల సీజన్ వచ్చేసింది. చలికాలం వచ్చిందంటే నారింజ పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఈ పండ్లు తినేందుకు చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో ఉండే పోషక విలువలు కూడా ఎక్కువే. ఎంతో మంది పండ్లను తిని తొక్కలను పడేస్తూ ఉంటారు. నిజానికి అలా తొక్కలను పడేయాల్సిన అవసరం లేదు. నారింజ తొక్కలను ఉపయోగించి వంటకాలకు మంచి రుచిని అందించవచ్చు. అలాగే మంచి రంగును ఇవ్వచ్చు. నారింజ తొక్కల పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి.
నారింజ తొక్కల ఉపయోగాలు
కొన్నిసార్లు నారింజ తొక్కలను పచ్చివిగానే వాడవచ్చు. వాటిని ఎండబెట్టి పొడి చేసి కూడా వాడవచ్చు. బేకింగ్ లో అంటే కేకులు వంటివి తయారు చేసేటప్పుడు నారించే తొక్కలను వాడితే మంచి రుచి వాసన వస్తాయి. కేకుల మిశ్రమంలో నారింజ తొక్కలను మిక్సీలో పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని కలపవచ్చు. ఇవి సహజమైన సిట్రస్ రుచిని అందించడమే కాదు, మంచి ఫ్లేవర్ ను కూడా ఇస్తాయి. కుకీలు, మఫిన్లలో టకూడా ఈ నారింజ ఫ్లేవర్ కోసం నారింజ తొక్కల పొడిని వాడవచ్చు.
ఆరెంజ్ పీల్స్ ను రకరకాల బిస్కెట్లు తయారీలో వాడితే టేస్టీగా ఉంటాయి. అలాగే చాక్లెట్లను తయారు చేయడానికి కూడా వాడవచ్చు. నారింజ మిఠాయిలు ఎంత రుచిగా ఉంటాయో అలాగే వీటితో చేసే చాక్లెట్లు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఫ్రూట్ సలాడ్లు, చాక్లెట్ల తయారీలో నారింజ తొక్కలను వాడడం అలవాటు చేసుకోండి.
నారింజ తొక్కల టీ
మీ దినచర్యలో కూడా ఆరెంజ్ తొక్కలను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నారెంజ తొక్కలతో టీ చేసుకుని తాగేందుకు ప్రయత్నించండి. ఈ టీలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి కూడా పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. ఇవి యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. నీటిలో నారింజ తొక్కలను వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. నారింజ తొక్కల్లోని సారమంతా నీళ్లల్లో కలిసిపోతుంది. దాన్ని వడకట్టి తాగుతూ ఉండాలి.
నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు నారింజ తొక్క పేస్టును కూడా ఒక స్పూన్ వేస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది మాంసంలోని కొవ్వు భారాన్ని తగ్గిస్తుంది. రుచిని సమతుల్యం చేస్తుంది. వాటిని తినాలన్న కోరికను కూడా పెంచుతుంది. ఒక్కసారి నారింజ తొక్కలను ఆహారంలో భాగం చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది అది ఎంత రుచిని అందిస్తుందో, ఆరోగ్యాన్ని ఇస్తుందో. నారింజ తొక్కలను అందానికి ఉపయోగించేవారు కూడా ఎంతోమంది. నారింజ తొక్కల పేస్టును ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖానికి మంచి కాంతిని అందిస్తుంది.
టాపిక్