OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన రూ.3 వేల కోట్ల వసూళ్ల హారర్ థ్రిల్లర్ మూవీ-ott horror thriller movie alien romulus now streaming on disney plus hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన రూ.3 వేల కోట్ల వసూళ్ల హారర్ థ్రిల్లర్ మూవీ

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన రూ.3 వేల కోట్ల వసూళ్ల హారర్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Nov 21, 2024 04:54 PM IST

OTT Horror Thriller: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. కేవలం రూ.675 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.3 వేల కోట్లు వసూలు చేయడం విశేషం.

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన రూ.3 వేల కోట్ల వసూళ్ల హారర్ థ్రిల్లర్ మూవీ
ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన రూ.3 వేల కోట్ల వసూళ్ల హారర్ థ్రిల్లర్ మూవీ

OTT Horror Thriller: ఈ ఏడాది హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్: రొములస్. ఆగస్ట్ 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఏలియన్ ఫ్రాంఛైజీలో భాగంగా రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా మూవీని చూసి థ్రిల్ కావచ్చు.

ఏలియన్: రొములస్ ఓటీటీ స్ట్రీమింగ్

ఎప్పుడో 45 ఏళ్ల కిందట వచ్చిన ఏలియన్ మూవీ ప్రపంచాన్ని ఊపేసింది. ఆ తర్వాత ఏడేళ్లకు ఏలియన్స్ మరింత పెద్ద హిట్ సాధించింది. అలా ఏలియన్ ఫ్రాంఛైజీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో మూవీ ఏలియన్: రొములస్.

ఇప్పుడీ సినిమా గురువారం (నవంబర్ 21) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో రావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఓటీటీలో మరింత ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏలియన్: రొములస్ మూవీ గురించి..

ఏలియన్ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన సినిమా ఇది. 1979లో వచ్చిన ఏలియన్, 1986లో వచ్చిన ఏలియన్స్ మూవీ తర్వాత ఇప్పుడీ ఏలియన్: రొములస్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫెడె అల్వారెజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

1986లో వచ్చిన ఏలియన్స్ తర్వాత ఇదే బెస్ట్ ఏలియన్ మూవీ అని క్రిటిక్స్ కూడా స్పష్టం చేశారు. దీంతో బాక్సాఫీస్ వసూళ్లలో మూవీ ఇరగదీసింది. ఏకంగా 35 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఓ పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచి తమకు పనికి వచ్చే వస్తువులను సేకరిస్తున్న సమయంలో విశ్వంలోని ఏలియన్స్ ఓ వింత జీవి రూపంలో వచ్చి వాళ్లపై దాడి చేస్తుంది.

వాటి నుంచి ఈ కాలనిస్ట్స్ తప్పించుకున్నారా లేదా అన్నదే ఈ ఏలియన్: రొములస్ మూవీ. ఏలియన్ ఫ్రాంఛైజీల్లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ మూవీకి క్రిటిక్స్ రేటింగ్ ఇచ్చారు. ఐఎండీబీలో 7.2 రేటింగ్, రోటెన్ టొమాటోస్ లో 80 శాతం స్కోరుతో ఈ మూవీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ ఏలియన్: రొములస్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

Whats_app_banner