Cream Biscuits Effects: మీ పిల్లలకు క్రీమ్ బిస్కెట్లు పెడుతున్నారా? భవిష్యత్తులో వారికి వచ్చే వ్యాధుల జాబితా ఇదే
Cream Biscuits Effects: పిల్లలు ఇష్టంగా క్రీమ్ బిస్కెట్లను తింటారు. అవి చాలా తీపిగా ఉండడమే దాతనికి కారణం. అయితే వాటి వల్ల వారికి భవిష్యత్తులో ఎన్నో ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.
Cream Biscuits Effects: పిల్లలు క్రీమ్ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. సాధారణ బిస్కెట్లతో పోలిస్తే వీటిలో క్రీమ్ చాలా తీపిగా ఉంటుంది. ఈ క్రీమ్ రుచి చాలా బాగున్నా... దీర్ఘకాలంగా పిల్లలు తినడం వల్ల వారికి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి క్రీమ్ బిస్కెట్లు తినే పిల్లలు త్వరగా ఉబకాయం బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వారి జ్ఞాపకశక్తి తగ్గడం కూడా జరుగుతుంది. ఈ క్రీమ్ లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఆవ నూనె అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి హాని చేసేవే.
మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి క్రీమ్ బిస్కెట్లు ఇవ్వడం మానేయమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ క్రీమ్ బిస్కెట్లు అల్ట్రా ప్రాసెస్ ఆహారాల జాబితాకు చెందినవి. ఇలాంటి ఆహారాలు మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా మెదడులో ఈ క్రీమ్ కు ప్రతిస్పందన వెంటనే వస్తుంది. కాబట్టి పిల్లలకు క్రీమ్ బిస్కెట్లను తినిపించడం మానేయాలి.
క్రీమ్ బిస్కెట్లు ఎందుకు తినకూడదు?
క్రీమ్ బిస్కెట్లను 100 ఏళ్ల నుంచి తయారు చేస్తున్నారు. ఈ బిస్కెట్ల తయారీలో మైదాపిండి, పామాయిల్ లేదా ఆవనూనె, కోకో పౌడర్, అధిక ప్రక్టోజ్ ఉన్న కార్న్ సిరప్, బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్, వెనిలియన్, చాక్లెట్, సోయా, లేసిథిన్, ఉప్పు అధికంగా వాడతారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే.
వచ్చే రోగాలు ఇవే
ఈ క్రీమ్ బిస్కెట్లలో ముఖ్యమైనవి చక్కెర, ఆవనూనె. వీటిని అధిక మొత్తంలో తినడం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఒక పది క్రీమ్ బిస్కెట్లు తినడం వల్ల మీ పిల్లలకు 700 క్యాలరీలు శరీరంలో చేరుతాయి. దీనివల్ల వారు దీర్ఘకాలికంగా లావుగా మారతారు. అలాగే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్, గుండెపోటు వంటి వాటి బారిన త్వరగా పడే అవకాశం ఉంది. అధిక ప్రక్టోజ్ ఉన్న చక్కెర, ఆవనూనెలతో నిండిన ఈ క్రీమ్ బిస్కెట్లను పిల్లలకు ఇవ్వడం మానేయాలి.
ఈ క్రీమ్ బిస్కెట్లను తినడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తిరిగి శారీరక సమస్యలు వస్తాయి. అలాగే మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జ్ఞాపకశక్తికి ప్రతికూలంగా ఇవి పని చేస్తాయి. ఆవనూనెను అధికంగా ఇలా బిస్కెట్ల రూపంలో తినడం వల్ల మెదడు పనితీరు మారిపోతుంది. పిల్లలు చదివినవి గుర్తుపెట్టుకోలేరు. గుండె ఆరోగ్యం పై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాసెస్డ్ షుగర్, ఆవనూనె ఈ రెండూ రక్తంలో కలిసి తీవ్రమైన ప్రతిచర్యలను ఇస్తాయి. ఇది గుండెలో మంటను ప్రేరేపిస్తుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే వారికి క్రీమ్ బిస్కెట్లను ఇవ్వడం పూర్తిగా మానేయండి.