Gobi Matar Curry: ఆలూ గోబీ బఠానీ కూర రెసిపీ, ఇలా చేశారంటే గిన్నె ఊడ్చేస్తారు, స్పైసీగా ఉంటుంది
Gobi Matar Curry: చలికాలంలో కారంగా ఉండే కూరను తినాలనిపిస్తుంది. రోటీ, చపాతీ, అన్నంలో కూడా తినేట్టు ఇక్కడ మేము ఆలూ గోబీ మటర్ కర్రీ రెసిపీ ఇచ్చాము. క్యాబేజీ, బంగాళాదుంప, బఠానీలతో తయారు చేసే ఈ వెజిటేబుల్ కర్రీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
చలిలో వేడివేడిగా స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తుంది. శాఖాహారులు, మాంసాహారులు తినగలిగేలా బంగాళాదుంప, కాలీ ఫ్లవర్, పచ్చి బఠానీలతో కూర ఎలా వండాలో చెప్పాము. ఈ పద్ధతిలో వండితే రుచి మామూలుగా ఉండదు. చూడగానే నోరూరిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇలాంటి కూరలు తినడం కూడా చాలా ముఖ్యం. ఆలూ గోబీ మటర్ కూర వండేందుకు చిన్న చిన్ని చిట్కాలు పాటిస్తే టేస్టీగా ఇది సిద్ధమైపోతుంది. ఇది రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా అతి తక్కువ సమయంలోనే రెడీ అవుతుంది.
బంగాళాదుంప గోబీ మటర్ కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యాబేజీ ముక్కలు - ఒక కప్పు
బఠానీలు - అర కప్పు
బంగాళాదుంపలు - రెండు
టమోటాలు - రెండు
ఎండు మిర్చి - రెండు
నల్ల మిరియాలు - అర టీస్పూన్
బిర్యానీ ఆకులు - రెండు
జీలకర్ర - అరస్పూను
ఉల్లిపాయలు - రెండు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
చిక్కటి పెరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - పది
ఆలూ క్యాబేజీ బఠానీ కూర రెసిపీ
- ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను నీటిలో వేసి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల కాలీ ఫ్లవర్లో ఉన్న చిన్న పురులుగు కూడా నీటిపైకి తేలుతాయి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
2. బంగాళాదుంపలను ఉడకించి పొట్టు తీసి ముక్కులుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో కాలీ ఫ్లవర్ ముక్కలు, బంగాళాదుంపల ముక్కలు వేసి వేయించాలి.
4. కూరగాయలు వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. తరువాత టమోటా తరుగు వేసి వేయించాలి. టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. వీటిని ప్యూరీలా మార్చుకోవాలి.
5. మిక్సీలో మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి నూనె వేయాలి. ఉల్లిపాయల తరుగును వేసి వేయించాలి.
7. ఉల్లిపాయల తరుగులో టమోటా ప్యూరీ వేసి బాగా కలపాలి.
8. అందులోనే కారం, ధనియాల పొడి, పెరుగు వేసి బాగా కలపాలి.
9. అందులోనే ముందుగా వేయించిన కూరగాయలను వేసి కలిపి పైన మూత పెట్టాలి.
10. సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మిరియాలు లవంగాల పేస్టును కూడా వేసి బాలా కలపాలి.
11. పదినిమిషాల పాటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే నీళ్లు వేసుకోవచ్చు.
12. కూర చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ ఆలూ గోబీ మటర్ కర్రీ రెడీ అయినట్టే.
బంగాళాదుంపలు, కాలీ ఫ్లవర్, పచ్చిబఠానీలు… అన్నింట్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి కాబట్టి పోషకాహారలోపం కూడా రాదు. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది.