Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్కామ్ 1992 వెబ్ సిరీస్ హీరో థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Thriller OTT: స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అగ్ని థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Thriller OTT: స్కామ్ 1992 వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అగ్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. స్కామ్ 1992 వెబ్‌సిరీస్‌తో నటుడిగా ఫేమస్ అయ్యాడు ప్రతీక్ గాంధీ.
1992 ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌లో హర్షద్ మెహతా పాత్రలో అసమాన నటనతో అదరగొట్టాడు ప్రతీక్ గాంధీ. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా స్కామ్ 1992 వెబ్‌సిరీస్ నిలిచింది.
బాలీవుడ్‌లో బిజీ...
స్కామ్ 1992 తర్వాత ప్రతీక్ గాంధీ నటుడిగా బాలీవుడ్‌లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో అగ్ని ఒకటి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ డోలాకియా దర్శకత్వంలో ప్రతీక్ గాంధీ నటించిన ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
డిసెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
ఫైర్ ఫైటర్స్ బ్యాక్‌డ్రాప్‌లో...
వృత్తి నిర్వహణలో అగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లతో దర్శకుడు రాహుల్ డోలాకియా అగ్ని మూవీని రూపొందించాడు. యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో పాటు అంతర్లీనంగా ఓ సందేశాన్ని టచ్ చేశారుడైరెక్టర్. ఫైర్ ఫైటర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియాలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదని మేకర్స్ చెబుతోన్నారు.
సయామీ ఖేర్...
అగ్ని మూవీలో ప్రతీక్ గాంధీతో పాటు సయామీ ఖేర్, దివ్యేందు శర్మ, సాయి తమ్హాంకర్ కీలక పాత్రలు పోషించారు. అగ్ని మూవీని బాలీవుడ్ హీరో డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రొడ్యూస్ చేయడం గమనార్హం.
స్కామ్ 1992 తర్వాత స్కూప్, మోడ్రన్ లవ్ ముంబాయి, గాంధీతో పలు వెబ్‌సిరీస్‌లు చేశాడు ప్రతీక్ గాంధీ. దో ఔర్ దో ప్యార్, మడగావ్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా కనిపించాడు.
సాయిధరమ్‌తేజ్ రేయ్‌తో...
అగ్నిలో కీలక పాత్రలో నటిస్తోన్న సయామీ ఖేర్ తెలుగు సినిమాలతోనే తన కెరీర్‌ను మొదలుపెట్టింది. సాయిధరమ్‌తేజ్ రేయ్ మూవీతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తెలుగులో నాగార్జున వైల్డ్ డాగ్‌తో పాటు హైవే సినిమాలు చేసింది.