Dhanush Divorce: హీరో ధనుష్‌తో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్య.. రెండేళ్లుగా తెగని పంచాయతీ
Dhanush Aishwarya Divorce: హీరో ధనుష్ గత వారం నుంచి నయనతారతో వివాదం కారణంగా వార్తల్లోనే ఉన్నాడు. గురువారం అతని భార్య ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ కోర్టుకి విడాకుల కోసం వచ్చింది.
తమిళ్ హీరో ధనుష్‌తో విడాకుల కోసం అతని భార్య ఐశ్వర్య గురువారం కోర్టుకి హాజరైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురైన ఐశ్వర్య 2004లో ధనుష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే.. భేదాభిప్రాయాలు రావడంతో.. 2022లో తాము విడిపోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
వారం నంచి నయనతారతో ధనుష్ వివాదం
వాస్తవానికి ధనుష్ ఇటీవల వరుస వివాదాల్లో ఉంటున్నాడు. గత వారం నుంచి నయనతార డాక్యుమెంటరీ వివాదంతో వార్తల్లో నిలిచిన ధనుష్.. 3 సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ధనుష్ డిమాండ్‌పై బహిరంగ లేఖతో రిప్లై ఇచ్చిన నయనతార.. అందరి ముందు ధనుష్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చాలా మంది టాప్ హీరోయిన్స్ కూడా నయనతారకి మద్దతుగా నిలిచి.. ధనుష్‌కి వ్యతిరేకంగా మారారు. ఇందులో ధనుష్‌తో కలిసి గతంలో సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా ఉండటం గమనార్హం.
రెండేళ్ల నుంచి ఐశ్వర్యకి దూరంగా ధనుష్
నయనతారతో వివాదం ఇంకా సమసిపోక ముందే.. ఇప్పుడు ఐశ్వర్యతో విడాకుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి గత రెండేళ్ల నుంచి ఐశ్వర్య, ధనుష్ కలిసి లేరు. విడివిడిగా ఉంటున్నారు. పిల్లలతో కలిసి రజినీకాంత్ ఇంట్లోనే ఐశ్వర్య ఉంటుండగా.. ధనుష్ తన సొంత ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే.. ఇటీవల స్కూల్‌లో పిల్లలకి సంబంధించిన ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు.
కలిసి ఉండలేమన్న ధునుష్, ఐశ్వర్య
చెన్నైలోని ధనుష్, ఐశ్వర్య విడాకులకి సంబంధించిన కేసు గురువారం ఫ్యామిలీ కోర్టులో విచారణకిరాగా.. కోర్టుకి హాజరైన దంపతులు తాము కలిసి ఉండాలని అనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకి తెలిపారు. ధనుష్, ఐశ్వర్య వాదనలు చెన్నై ఫ్యామిలీ కోర్టు.. కేసు తుది తీర్పుని ఈ నెల 27కి వాయిదా వేసింది.
ముగిసిన 18 ఏళ్ల జర్నీ
ధనుష్, ఐశ్వర్య దాదాపు దశాబ్దన్నరపాటు చాలా అన్యోన్యంగా కనిపించారు. కానీ.. స్పష్టమైన కారణం తెలియదుకానీ.. 2022లో జనవరిలో మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని అనుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో తొలుత ఐశ్వర్య పోస్ట్ పెట్టింది. దాదాపు 18 ఏళ్ల పాటు ఫ్రెండ్స్, పేరెంట్స్‌గా జర్నీని కొనసాగించామని.. కానీ ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నామని అందులో రాసుకొచ్చింది.