Pushpa 2 Update: పుష్ప 2 గురించి కీలక అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్-pushpa 2 the rule climax shooting underway movie team gives major update about allu arjun movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Update: పుష్ప 2 గురించి కీలక అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Pushpa 2 Update: పుష్ప 2 గురించి కీలక అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 05, 2024 03:04 PM IST

Pushpa 2 The Rule Update: పుష్ప 2: ది రూల్ సినిమా గురించి మూవీ టీమ్ ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చింది. షూటింగ్ వివరాలు చెప్పింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.

Pushpa 2 Update: పుష్ప 2 గురించి కీలక అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
Pushpa 2 Update: పుష్ప 2 గురించి కీలక అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ముందు వరుసలో ఉన్న ‘పుష్ప 2: ది రూల్’పై వరుసగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు తీవ్రంగా మారాయని కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. కోపంతో అల్లు అర్జున్ గడ్డం తీసేశారని, ఓ దశలో షూటింగ్ నుంచి వెళ్లిపోయారని, మూవీ మళ్లీ వాయిదా పడుతుందని ఇలా రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కన్‍ఫ్యూజన్ ఏర్పడింది. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కావాల్సిన పుష్ప 2 షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందనే టెన్షన్ అల్లు అర్జున్ అభిమానుల్లో నెలకొంది. రూమర్లకు తెరదించేలా పుష్ప 2 మూవీ నేడు (ఆగస్టు 5) మేజర్ అప్‍డేట్ ఇచ్చింది.

క్లైమాక్స్ షూటింగ్

పుష్ప 2: ది రూల్ షూటింగ్ గురించి ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అప్‍డేట్ ఇచ్చింది. క్లైమాక్స్ కోసం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోందని, డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేసింది. “క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‍ను పుష్ప 2: ది రూల్ మూవీ జరుపుకుంటోంది. డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా పుష్ప 2 రిలీజ్ అవుతుంది” అని ట్వీట్ చేసింది. జాతర ఫైట్‍కు సంబంధించిన జిఫ్‍ను పోస్ట్ చేసింది.

అభిమానులకు ఊరట

ఇటీవలే యూరప్ ట్రిప్ నుంచి అల్లు అర్జున్ తిరిగి వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్‍కు వెళ్లారని సమాచారం బయటికి వచ్చింది. అయితే, సుకుమార్‌తో విభేదాల వల్ల ఆయన మళ్లీ మధ్యలోనే వచ్చేశారనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో గందరగోళం నెలకొంది. అయితే, మూవీ టీమ్ ఇచ్చిన తాజా అప్‍డేట్‍తో ఆ రూమర్లలో వాస్తవం లేదని తేలిపోయింది.

షూటింగ్ అప్‍డేట్‍తో పాటు రిలీజ్ డేట్‍ను కూడా మళ్లీ చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిసెంబర్ 6న ఈ చిత్రం రావడం పక్కా అని నమ్మకం పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీనే రిలీజ్ కావాల్సింది. అయితే, డిసెంబర్ 6కు వాయిదా పడింది. డైరెక్టర్ సుకుమార్ వల్లే ఈ చిత్రం ఆలస్యమవుతోందని సమాచారం బయటికి వచ్చింది. 2021లో వచ్చి బ్లాక్‍బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2పై పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అన్ని విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ, రీషూట్లు చేస్తూ డైరెక్టర్ లేట్ చేస్తున్నారని రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపైనే అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారనే ఊహాగానాలు వచ్చాయి.

పుష్ప 2: ది రూల్ చిత్రంలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పాటలు ఐదు భాషల్లోనూ బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీశ్ ప్రతాప్ బండారీ, ప్రకాశ్ రాజ్, సునీల్, రావు రామేశ్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు.