Jabardasth Promo: జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కంటెస్టెంట్స్ గొడ‌వ - రాఘ‌వ‌ను అవ‌మానించిన ఇమాన్యుయేల్ - టీఆర్‌పీ కోస‌మేనా?-jabardasth latest promo bullet bhaskar warns rocket raghava telugu tv show etv comedy show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jabardasth Promo: జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కంటెస్టెంట్స్ గొడ‌వ - రాఘ‌వ‌ను అవ‌మానించిన ఇమాన్యుయేల్ - టీఆర్‌పీ కోస‌మేనా?

Jabardasth Promo: జ‌బ‌ర్ధ‌స్థ్‌లో కంటెస్టెంట్స్ గొడ‌వ - రాఘ‌వ‌ను అవ‌మానించిన ఇమాన్యుయేల్ - టీఆర్‌పీ కోస‌మేనా?

Nelki Naresh Kumar HT Telugu
Aug 14, 2024 11:32 AM IST

Jabardasth Promo: జ‌బ‌ర్ధ‌స్థ్ కొత్త ప్రోమో గొడ‌వ‌లు, ఆర్గ్యూమెంట్స్‌తో ఆస‌క్తిని పంచుతోంది. రాకెట్ రాఘ‌వ‌తో పాటు బుల్లెట్ భాస్క‌ర్‌, ఇమాన్యుయేల్ గొడ‌వ ప‌డ్డారు. ఈ గొడ‌వ‌లు మొత్తం టీఆర్‌పీల కోస‌మే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

జ‌బ‌ర్ధ‌స్థ్  ప్రోమో
జ‌బ‌ర్ధ‌స్థ్ ప్రోమో

Jabardasth Promo: జ‌బ‌ర్ధ‌స్థ్ కొత్త ప్రోమో న‌వ్వుల‌తో కాకుండా వివాదాల‌తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రోమోలో జ‌బ‌ర్ధ‌స్థ్ సీనియ‌ర్ కంటెస్టెంట్ రాకెట్ రాఘ‌వ‌తో ఇమాన్యుయేల్‌, బుల్లెట్ భాస్క‌ర్ గొడ‌వ‌ప‌డ్డారు. జ‌డ్జ్‌లు కూడా కూడా రాకెట్ రాఘ‌వ‌పై ఫైర్ అయ్యారు.

రెండు టీమ్‌లు...

ఈ లెటెస్ట్ ప్రోమో జ‌బ‌ర్ధ‌స్థ్ కంటెస్టెంట్స్ స‌ర‌దా శుక్ర‌వారం...స‌రిపోదా శ‌నివారం పేరుతో రెండు టీమ్‌లుగా విడిపోయారు. ఆరంభంలో బుల్లెట్ భాస్క‌ర్‌, రాకెట్ రాఘ‌వ ఒక‌రిపై మ‌రొక‌రు పంచ్‌లు వేసుకున్నారు. యాభై ఆరు ఛేజ్ చేశాం ఇంకా సిగ్గు రాలేదా మీకు అని రాఘ‌ను బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. అత‌డి మాట‌ల‌తో హ‌ర్ట్ అయిన రాఘ‌వ‌...న‌లుగురిని న‌వ్వించ‌డం అంటే న‌లుగురిని మెయింటేన్ చేయ‌డం అంత ఈజీ కాదు...

ఇంకోటి కూడా గుర్తుంచుకొండి ..జిమ్‌కు వెళితే కండ‌లు వ‌స్తాయి కామెడీ రాద‌ని బుల్లెట్ భాస్క‌ర్‌పై సెటైర్లు వేశాడు. చిన్న పిల్ల‌లు బ‌చ్చాలు గెలిస్తుంటే ముద్దొస్తుంది మాకు అదొక ఆనందం అంటూ బుల్లెట్ భాస్క‌ర్‌ను ఎగ‌తాళి చేశాడు. ఐదు వేల రూపాయ‌ల కోసం మ‌మ్మ‌ల్ని బ‌చ్చాలు అంటావా అంటూ రాకెట్ రాఘ‌వ‌తో బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. తొలుత ఈ వాద‌న స‌ర‌దాగా సాగింది.

స్టేజ్‌పైకి రాఘ‌వ‌...

ఆ త‌ర్వాత ఇమాన్యుయేల్ స్కిట్ మొద‌లుపెట్ట‌గానే రాఘ‌వ హోల్డ‌న్ హోల్డ‌న్ అంటూ అత‌డిని డిస్ట్ర‌బ్ చేశాడు. ఫ‌స్ట్ ఫ‌స్ట్ వ‌స్తావేంది వెన‌క్కిపో అని ఇమాన్యుయేల్ చెబుతున్న రాఘ‌వ విన‌లేదు. ఆగిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు తీయండి దుకాణం అంటూ స్కిట్‌లోని ప్రాప‌ర్టీ మొత్తం రాఘ‌వ తీసేయ‌డం మొద‌లుపెట్టాడు. దాంతో రాఘ‌వ‌ను స్టేజ్‌పై నుంచి ఇమాన్యుయేల్ తోసేశాడు. ఇమాన్యుయేల్‌కు స‌పోర్ట్‌గా బుల్లెట్ భాస్క‌ర్ వ‌చ్చాడు. వ‌య‌సులో పెద్దాడివ‌ని ఊరుకుంటున్నా అంటూ వేలు చూపిస్తూ రాఘ‌వ‌కు బుల్లెట్ భాస్క‌ర్ వార్నింగ్ ఇచ్చాడు.

2020 స్కిట్‌...

ఎప్ప‌డిదో 2020 స్కిట్‌ను మ‌ళ్లీ చేశార‌ని, వారిని విన్న‌ర్స్‌గా ప్ర‌క‌టిస్తే ఊరుకునేది లేద‌ని జ‌డ్జిలు కృష్ణ‌భ‌గ‌వాన్‌, ఖుష్బూల‌తో బుల్లెట్ భాస్క‌ర్ వాదించాడు. వాళ్లు స్కిట్ చేస్తున్న‌ప్పుడు మేము ఎవ్వ‌రం డిస్ట్ర‌బ్ చేయ‌లేదు. ఇమ్మాన్యుయేల్ స్కిట్ చేస్తున్న‌ప్పుడు రాఘ‌వ మూడు, నాలుగు సార్లు స్టేజ్‌పైకి వ‌చ్చి స్కిట్ పూర్తికాకుండా అడ్డుప‌డ్డాడ‌ని బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. రాఘ‌వ వ‌ల్ల ఇమాన్యుయేల్ మెంట‌ల్‌గా అప్‌సెట్ అయ్యాడ‌ని జ‌డ్జ్‌ల‌తో బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. వ‌ర్ష కూడా రాఘ‌వ‌తో గొడ‌వ ప‌డిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

రాఘ‌వ క్ష‌మాప‌ణ‌లు...

దాంతో బుల్లెట్ భాస్క‌ర్‌తో పాటు అత‌డి టీమ్ మెంబ‌ర్స్‌కు రాకెట్ రాఘ‌వ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. త‌మ టీమ్‌కు రావాల్సిన మార్కుల‌ను వారికే ఇవ్వాల‌ని జ‌డ్జ్‌ల‌కు సూచించాడు. అక్క‌డ స్కిట్‌లోనూ ఎంట‌ర్ అయ్యారు...ఇక్క‌డ జ‌డ్జ్‌మెంట్‌లోకి ఎంట‌ర్ అవుతారా అంటూ రాఘ‌వ‌కు కృష్ణ భ‌గ‌వాస్ క్లాస్ ఇచ్చాడు.

ఈ స్కిట్ ప్రోమో యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. అయితే కొంద‌రు ఫ్యాన్స్ మాత్రం కావాల‌నే టీఆర్‌పీ కోసం కావాల‌నే క్రియేట్ చేసిన గొడ‌వ‌లు ఇవంటూ ప్రోమోను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చూశామంటూ చెబుతోన్నారు. ఆగ‌స్ట్ 16, 17వ తేదీల‌లో జ‌బ‌ర్ధ‌స్థ్ ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది.

Whats_app_banner