Telugu OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాజ్‌తరుణ్ లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - రిలీజ్ డేట్ ఇదేనా?
Telugu OTT: రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Telugu OTT: రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది.
రొటీన్ కాన్సెప్ట్...
యథార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు రామ్ భీమన పురుషోత్తముడు మూవీని తెరకెక్కించాడు.జూలై 26న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. టాలీవుడ్‌కు చెందిన పలువురు సీనియర్ యాక్టర్లు నటించడం, రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన వివాదాల కారణంగా పురుషోత్తముడు సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
తాజాగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే పురుషోత్తముడు మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. ఆగస్ట్ 23న పురుషోత్తముడు మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
పురుషోత్తముడు కథ ఇదే...
ఇండియాలోనే టాప్ బిజినెస్‌మెన్ ఆదిత్య రామ్ (మురళీశర్మ) కొడుకు రచిత్ రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తిచేసుకొని ఇండియాకు వస్తాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకు రచిత్ రామ్‌కు అప్పగించాలని ఆదిత్య రామ్ అనుకుంటాడు. వసుంధర(రమ్యకృష్ణ) అందుకు అడ్డుచెబుతుంది.
కంపెనీ రూల్ ప్రకారం సీఈవో కాబోయే వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాలని కండీషన్ పెడుతుంది. ఆ కండీషన్ కారణంగా సిటీని వదిలిపెట్టి రాయపులంక అనే పల్లెటూరికి వస్తాడు రచిత్ రామ్. ఆ పల్లెటూరిలో అతడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? రచిత్ రామ్ కోటీశ్వరుడు అనే నిజం ఆ ఊరి వాళ్లకు తెలిసిందా? రచిత్ రామ్ జీవితంలోకి వచ్చిన అమ్ము (హాసిని సుధీర్) ఎవరు? వసుంధరతో రచిత్ రామ్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
బ్రహ్మానందం...సత్య...
పురుషోత్తముడు సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. ఇందులో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సత్యతో పాటు పలువురు కమెడియన్లు నటించారు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో శ్రీమంతుడుతో పాటు పలు సినిమాలు రావడం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో సినిమా ఆడియెన్స్ మెప్పించలేకపోయింది.
తిరగబడరా సామీ...
పురుషోత్తముడు రిలీజైన వారం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామీ థియేటర్లలో రిలీజైంది. పురుషోత్తముడు బాటలోనే ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రాజ్‌తరుణ్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తరుణ్ తనతో పదకొండేళ్లు సహజీవనం చేయడమే కాకుండా పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ఇటీవలే లావణ్య అనే యువతి కేసు పెట్టింది. ఈ వివాదం రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది.