Ramya Krishnan Mass Song With Ntr: నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో మాస్ పాటకు డ్యాన్స్ చేశా : రమ్యకృష్ణ
Ramya Krishna Mass Song With Ntr ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది రమ్యకృష్ణ. ఈ షోలో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన నా అల్లుడు సినిమాలో మాస్ పాటకు సంబంధించి ఆసక్తికర సీక్రెట్‌ను రివీల్ చేసింది రమ్యకృష్ణ.
Ramya Krishna Mass Song With Ntr ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగింది రమ్యకృష్ణ. అగ్ర హీరోలందరితో సినిమా చేసింది. గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్నది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తోంది రమ్యకృష్ణ. ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకల్ని పలకరించింది. ఇందులో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు డ్యాన్స్ ఐకాన్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది రమ్యకృష్ణ.
ఈ షోలో నా అల్లుడు సినిమా టైమ్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించింది రమకృష్ణ. డ్యాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ నా అల్లుడు సినిమాలోని సయ్యా సయ్యారే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఒరిజినల్ సాంగ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి రమ్యకృష్ణ నటించింది. ఈ పాట తాలూకు జ్ఞాపకాల్ని కంటెస్టెంట్స్‌తో పంచుకున్నది రమ్యకృష్ణ.
ఈ పాటలో నటిస్తున్న సమయంలో తాను నాలుగు నెలల గర్భవతినని చెప్పింది. పెగ్నెన్సీ టైమ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి మాస్ పాటలో స్టెప్పులు వేసినట్లు చెప్పింది. ఆమె అంకితభావానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఎన్టీఆర్, శ్రియా, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2005లో విడుదలైంది. ఇందులో భానుమతి అనే పొగరు, అహంకారం ఉన్న అత్తగా రమ్యకృష్ణ కనిపించింది.
ప్రస్తుతం భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగ మార్తండ సినిమాలో కీలక పాత్ర నటిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.