Ram vs Raviteja: రవితేజను దాటేసిన రామ్ - 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్
Ram vs Raviteja: ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్‌పైనే తెలుగు ఆడియెన్స్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ ఇస్మార్ట్ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Ram vs Raviteja: ఈ వారం బాక్సాఫీస్ వద్ద రవితేజ, రామ్ మధ్య పోటీ నెలకొంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రవితేజ మిస్టర్ బచ్చన్‌తో పాటు రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు నార్నే నితిన్ ఆయ్, విక్రమ్ తాంగలాన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తోన్నాయి. అయితే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పైనే తెలుగు ఆడియెన్స్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
రామ్ కెరీర్‌లో రికార్డ్...
ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ పరంగా రవితేజ మిస్టర్ బచ్చన్‌పై రామ్ డబుల్ ఇస్మార్ట్‌దే డామినేషన్ కనిపిస్తోంది. రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డబుల్ ఇస్మార్ట్ నిలిచింది. లైగర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ మాస్ యాక్షన్ మూవీ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 49 కోట్లకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
స్కంద రికార్డ్ బ్రేక్...
రామ్, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన స్కంద మూవీ 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన మూవీగా స్కంద నిలిచింది. ఆ మూవీ రికార్డును డబుల్ ఇస్మార్ట్ తిరగరాసింది. అంతే కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా డబుల్ ఇస్మార్ట్ నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
మరోవైపు రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. రవితేజ కెరీర్‌లో హయ్యెస్ట్ అయినా రామ్ డబుల్ ఇస్మార్ట్‌తో పోలిస్తే మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువగానే జరగడం గమనార్హం.
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్...
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు.
రైడ్ రీమేక్...
మిస్టర్ బచ్చన్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ మాస్ యాక్షన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రైడ్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.