Jr NTR Injury Update: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: అప్‍డేట్ వెల్లడించిన టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..-devara actor jr ntr suffers worst injury his team gives update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Injury Update: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: అప్‍డేట్ వెల్లడించిన టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

Jr NTR Injury Update: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: అప్‍డేట్ వెల్లడించిన టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 05:09 PM IST

Jr NTR Injury: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆయన మణికట్టుకు గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ వెల్లడించింది. అలాగే, మరిన్ని వివరాలను వెల్లడించింది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: అప్‍డేట్ వెల్లడించిన టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం: అప్‍డేట్ వెల్లడించిన టీమ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

మ్యాన్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం తన షూటింగ్‍ను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి ‘వార్ 2’ మూవీని కూడా ఆయన చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ తదుపరి ఓ సినిమాకు రెడీ అయ్యారు. అయితే, ఈ తరుణంలో ఎన్టీఆర్ ఓ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరారనే రూమర్లు రావడంతో అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ పడుతున్నారు. దీంతో ఈ విషయంపై నేడు (ఆగస్టు 14) అప్‍డేట్ ఇచ్చింది ఎన్టీఆర్ టీమ్.

వర్కౌట్స్ చేస్తుండగా..

ఎన్టీఆర్ గాయం గురించి ఆయన టీమ్ ఓ స్టేట్‍మెంట్ రిలీజ్ చేసింది. రెండు రోజుల క్రితం జిమ్‍లో వర్కౌట్స్ చేస్తుండగా.. ఆయన ఎడమచేతి మణికట్టుకు స్వల్ప గాయమైనట్టు వెల్లడించింది. ఆయన చేతికి కట్టుకట్టినట్టు తెలిపింది.

రెండు వారాల్లో..

ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమే అయిందని టీమ్ పేర్కొంది. ఆయన రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటారని, మళ్లీ వర్క్ మొదలుపెడతారని వెల్లడించింది. ఈలోగా ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. “రెండు రోజుల కింద జిమ్‍లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఎడమ మణికట్టు కాస్త బెణికింది. ముందు జాగ్రత్తగా చర్యగా ఆయన చేతికి కట్టుకట్టారు. గాయం ఉన్నా దేవర షూటింగ్‍ను గత రాత్రి ఎన్టీఆర్ పూర్తి చేసేశారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు. కట్టును రెండు వారాల్లో తీసేస్తాం. ఆయన త్వరలోనే మళ్లీ వర్క్‌కు వెళతారు” అని ఎన్టీఆర్ ఆఫీస్ ఓ స్టేట్‍మెంట్ రిలీజ్ చేసింది. అలాగే, ఇందుకు సంబంధించి ఎలాంటి పుకార్లు వద్దని పేర్కొంది.

దేవరలో ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి

గాయం ఉన్నా దేవర షూటింగ్‍లో ఎన్టీఆర్ అలాగే పాల్గొన్నారు. ఈ మూవీ కోసం తన షూటింగ్‍ను గతరాత్రే ఫినిష్ చేశారు. ఈ విషయాన్ని గత రాత్రి సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ వెల్లడించారు. “దేవర పార్ట్ 1 కోసం నా షూటింగ్‍ను ఇప్పుడే పూర్తి చేసుకున్నా. సముద్రమంత ప్రేమను, ఈ అద్భుతమైన టీమ్‍ను నేను మిస్ అవుతా. శివ రూపొందించిన ప్రపంచంలో సెప్టెంబర్ 27న ప్రతీ ఒక్కరూ విహరించడాన్ని చూసేందుకు వేచిచూడలేకున్నా” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవర షూటింగ్ సెట్స్‌లో డైరెక్టర్ కొరటాల శివతో మాట్లాడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు.

గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్‍లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. ఫియర్ సాంగ్ ముందుగా దుమ్మురేపగా.. ఇటీవలే వచ్చిన మెలోడీ సాంగ్ ‘చుట్టమల్లే’ మార్మోగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.