Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి-devara first single released fear song out from jr ntr movie anirudh ravichander electrifying tune ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Devara First Single - Fear Song Released: దేవర సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. ఫియర్ సాంగ్ అంటూ వచ్చిన ఈ పాట పవర్‌ఫుల్‍గా ఉంది. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు.

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. గూజ్‍బంప్స్ తెప్పించేలా పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట

Devara Fear Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి తొలి పాటను మూవీ టీమ్ నేడు (మే 19) రిలీజ్ చేసింది. రేపు (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫియర్ సాంగ్‍ను నేడు తీసుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రానికి తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఫియర్ సాంగ్‍కు అనిరుధ్ పవర్‌ఫుల్ ట్యూన్ ఇచ్చారు.

అనిరుధ్ గాత్రంతోనే..

దేవర చిత్రంలోని ఈ ఫియర్ సాంగ్‍ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందరే పాడారు. తెలుగులో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇంటెన్స్‌తో పాటు తన మార్క్ ట్రెండీ ట్యూన్‍తో అనిరుధ్ ఆకట్టుకున్నాడు.

దేవర ముంగిట నువ్వెంత.. పవర్‌ఫుల్‍గా..

“ఆగ్గట్టుకుంది సంద్రం.. భగ్గునమండే ఆకాశం” అంటూ ఈ ఫియర్ సాంగ్ షురూ అయింది. “దూకే ధైర్యమా జాగ్రత్తా.. దేవర ముంగిట నువ్వెంత” అంటూ పవర్ ఫుల్ లైన్స్ ఉన్నాయి. ఈ పాటకు అదిరిపోయే లిరిక్స్ ఇచ్చారు రామజోగయ్య శాస్త్రి. దేవర గ్లింప్స్‌లోని ఎన్టీఆర్ యాక్షన్ విజువల్స్ కూడా ఈ సాంగ్ వీడియోలో అదిరిపోయాయి.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ పాట రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, హిందీలో అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. కన్నడ, మలయాళంలో సంతోష్ వెంకీ పాడారు. ఆయా భాషలకు లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు.

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, కలైయారాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు చేస్తున్నారు.

దేవర సినిమాను సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ఈ మూవీ రేంజ్‍లో ఉండనుందో క్లారిటీ ఇచ్చేసింది. దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో దేవరపై పైహ్ విపరీతంగా ఉంది. ఈ మూవీ హిందీ ఉత్తరాది థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.

దేవర చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తుండగా.. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ రేంజ్‍లో ఈ మూవీ రూపొందుతోంది. వీఎఫ్‍ఎక్స్ కూడా ఈ మూవీలో ఆశ్చర్యపరిచేలా ఉంటుందని తెలుస్తోంది.

తన అభిమానులు కాలర్ ఎగరేసేలా దేవర మూవీ ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు. టిల్లు స్క్వేర్ ఈవెంట్‍లో అభిమానులకు హుషారెత్తించేలా ఈ కామెంట్ చేశారు. దేవర చిత్రం తనతో పాటు ఎన్టీఆర్ అభిమానులకు చాలా స్పెషల్‍గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ కూడా ఇటీవల అన్నారు. మొత్తంగా దేవర సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.