Guppedantha Manasu August 14th Episode: శైలేంద్రను కిడ్నాప్ చేసిన మను -దేవయానికి షాక్ -ఎండీని ప్రకటించనున్న వసు
Guppedantha Manasu August 14th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 14 ఎపిసోడ్‌లో ఎండీ కాబోతున్న ఆనందంలో అందరికంటే ముందే కాలేజీకి బయలుదేరుతాడు శైలేంద్ర. కానీ అతడిని పాండు కిడ్నాప్ చేస్తాడు. తనను మను కిడ్నాప్ చేయించాడని తెలుసుకొని శైలేంద్ర షాకవుతాడు.
ఒక ఆడదాని మనసు..అందులోనూ భార్య మనసు మీ మగాళ్లకు అర్థం కాదంటూ రిషిపై సెటైర్లు వేస్తుంది. తన భర్త వేరే అమ్మాయివైపు చూసినా...మరో అమ్మాయి గురించి మాట్లాడిన తట్టుకోలేదని అంటుంది. ఇంకోసారి మా సరోజ అంటూ ఊరుకునేది లేదని రిషికి క్లాస్ ఇస్తుంది.
శైలేంద్ర కిడ్నాప్...
తాను చేసిన నేరాలన్నీ పోలీసుల ముందు ఒప్పుకొని లొంగిపోతున్నట్లు శైలేంద్రను పాండు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. పాండు ఎక్కడ అన్నంత పనిచేస్తాడోనని హడావిడిగా అతడిని కలుస్తాడు శైలేంద్ర. తాను ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల ఈ రోజు తీరబోతుందని, దానిని చెడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని పాండుకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. నువ్వు నన్ను ఏం చేయలేవని అంటాడు. కానీ తెలివిగా శైలేంద్రను తన దగ్గరకు రప్పించిన పాండు అతడిని కిడ్నాప్ చేస్తాడు.
ఎప్పటికీ ఎండీ కాలేడు...
బోర్డ్ మీటింగ్‌కు బయలుదేరుతాడు ఫణీంద్ర. తన కంటే ముందే శైలేంద్ర కాలేజీకి వెళ్లాడని దేవయాని ద్వారా తెలుసుకొని ఫణీంద్ర ఆశ్చర్యపోతాడు. డీబీఎస్‌టీ కాలేజీకి కాబోయే ఎండీ అని శైలేంద్ర కలలు కంటున్నాడా...అలా అనుకుంటే కష్టం అని కొడుకు గాలి తీసేస్తాడు ఫణీంద్ర. రిషి ఎప్పటికీ శైలేంద్రకు ఎండీ బాధ్యతలను అప్పగించడని చెబుతాడు. ఎండీ సీట్‌పై హోప్స్ పెట్టుకోవద్దని క్లాస్ ఇస్తాడు.
దేవయానికి షాక్...
భర్త వెంట తాను బోర్డ్ మీటింగ్‌కు బయలుదేరబోతుంది దేవయాని. కానీ ఫణీంద్ర అందుకు ఒప్పుకోడు. నువ్వు బోర్డ్ మీటింగ్‌లో లేకపోతేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుందని దేవయానితో అంటాడు. నువ్వు కాలేజీకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందని భార్యను ఎగతాళి చేస్తాడు.
ఈ సారి ఎలాంటి గొడవలు లేకుండా ఎవరో ఒకరికి ఎండీ బాధ్యతలు అప్పజెప్పాలంటే నువ్వు కాలేజీకి రాకూడదని గట్టిగా చెబుతాడు. భర్త ఎంత చెప్పిన వినకుండా తాను కాలేజీకి రావాల్సిందేనని దేవయాని పట్టుపడుతుంది. అయితే నువ్వు వెళ్లు నేను ఇంట్లోనే ఉంటానని ఫణీంద్ర అనడంతో వెనక్కి తగ్గుతుంది దేవయాని. నేను వెళ్లిన తర్వాత ఏవో సాకులు చెప్పి కాలేజీకి వస్తే బాగుండదని, గడపదాటొద్దని భార్యకు వార్నింగ్ ఇస్తాడు.
కాలేజీకి రిషి దూరం...
డీబీఎస్‌టీ కాలేజీ మీ ప్రాణమని నాకు తెలుసునని రిషితో అంటుంది వసుధార. రంగాగా నటిస్తోన్న మీరు మళ్లీ రిషిలా మారడానికి ఈ కాలేజీనే కారణమని చెబుతుంది. ఎండీ సీట్ వల్లే మన జీవితాలు మొత్తం తారుమారుఅవుతున్నాయని, కాలేజీ కారణంగా మీకు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నానని రిషితో చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధార.
కాలేజీని మనం వదిలిపెట్టి వెళ్లిపోవడమే మంచిదని చెబుతుంది. కానీ రిషి మాత్రం కాలేజీని దూరం కావడానికి ఒప్పుకోడు. మీ అన్నయ్య ఇన్ని కుట్రల చేస్తున్న ఎందుకు మౌనంగా ఉంటున్నారని రిషిని అడుగుతుంది వసుధార. నేను బంధాలకు బంధీనని, రిషిగా చేయలని కొన్ని పనులను రంగా చేయబోతున్నానని అంటాడు రిషి. అతడు ఏం చేస్తాడోనని వసుధార ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది.
నిజం చెప్పిన పాండు...
శైలేంద్ర ముఖంపై ముసుగు వేసి అతడిని కట్టిపడేస్తాడు పాండు. తనను వదిలేయమని పాండును బతిమిలాడుతాడు శైలేంద్ర. మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు డీల్ వచ్చిందని పాండు అంటాడు. నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు అని శైలేంద్ర అడిగిన పాండు మాత్రం సమాధానం చెప్పడు.
తమ కంటే ముందే బోర్డ్ మీటింగ్ బయలుదేరిన శైలేంద్ర ఇంకా కాలేజీకి రాకపోవడం చూసి రిషి, ఫణీంద్ర ఆశ్చర్యపోతారు.
మను ఎంట్రీ...
శైలేంద్రను మను కిడ్నాప్ చేయిస్తాడు. శైలేంద్ర మాకు ఎన్నో డీల్స్ ఇచ్చిన ఏది సక్సెస్ చేయలేకపోయాని, మేము ఎప్పటికీ రౌడీల కాలేమని ఇన్నాళ్లు భయపడ్డామని మనుతో అంటాడు పాండు. మా కెరీర్‌లో సక్సెస్ అయిన ఫస్ట్ డీల్ ఇదని, అందుకే మీరు ఇచ్చిన డబ్బులను రిటర్న్ ఇస్తున్నామని చెప్పి చేతులో డబ్బులు పెట్టి పాండు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ముఖానికి ఉన్న ముసుగు తీయగానే మనును చూసి శైలేంద్ర షాకవుతాడు. శైలేంద్రకు దేవయాని, రిషి ఫోన్ చేసిన మను కట్ చేస్తాడు. శైలేంద్ర వచ్చిన తర్వాతే బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఓ బోర్డ్ మెంబర్ అంటాడు. అవసరం లేదని ఫణీంద్ర బదులిస్తాడు.
రిషి కాలేజీకి దూరమైన తర్వాత...
రిషి దూరమైన తర్వాత కాలేజీకి ఎదురైన కష్టాలను ఏకరువు పెడతారు ఫణీంద్ర, మహేంద్ర. కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందని అనుకుంటున్నప్పుడే కరెక్ట్ టైమ్‌లో మీరు రీఎంట్రీ ఇచ్చారు అని రిషిపై ప్రశంసలు కురిపిస్తారు. కొంత మందికి ఏ టైమ్‌లో ఎప్పుడు రావాలో బాగా తెలుసు అని వసుధార బదులిస్తుంది. రిషి దేవుడిలా లాస్ట్ మినిట్‌లో ఎంట్రీ ఇచ్చి కాలేజీని కాపాడాడని చెబుతుంది.
ఎవరు ఎండీ..?
మీరు ఎవరి పేరు చెబితే వాళ్లనే ఎండీగా మేమంతా ఒప్పుకుంటామని బోర్డ్ మెంబర్స్ అంటారు. కానీ రిషి సైలెంట్‌గా ఉంటాడు. రిషి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఎవరి పేరును చెప్పలేకపోతున్నారని వసుధార అంటుంది. మరి ఏం చేద్దామని వసుధారను అడుగుతాడు ఫణీంద్ర.
కాలేజీ మాజీ ఏండీగా తానే కొత్త ఎండీని ప్రకటించబోతున్నట్లు చెబుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.