Guppedantha Manasu Serial: రిషి కోసం వసు ఎదురుచూపులు - శైలేంద్ర శాడిజం - దేవయాని తిక్క కుదిర్చిన ఫణీంద్ర
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూన్ 6 ఎపిసోడ్‌లో రిషి కనిపించడం లేదని పేపర్‌లో యాడ్ ఇస్తుంది వసుధార. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను రిషిని చూశానని చెబుతాడు.
Guppedantha Manasu Serial: రిషి లేడని పోలీసులతో పాటు అందరూ చెప్పడం వసుధార సహించలేకపోతుంది. తాను ఊపిరితో ఉన్నానంటే రిషి బతికే ఉన్నట్లేనని మహేంద్రతో చెబుతూ ఎమోషనల్ అవుతుంది వసుధార. ఎవరూ నమ్మిన నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నట్లు వసుధారను ఓదార్చుతాడు మహేంద్ర. అది మీ భ్రమ బాబాయ్ అని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర అంటాడు.
రిషి ఎప్పటికీ రాడని, అతడు బతికి లేడని చెబుతాడు. రిషి ఉన్నాడు..వచ్చి తీరుతాడని శైలేంద్ర గట్టిగా సమాధానమిస్తుంది వసుధార. నాటకాలు ఆడకుండా ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. నా కంటే మీరే పెద్ద మోసగాళ్లు అంటూ మహేంద్ర వార్నింగ్‌ను శైలేంద్ర తేలిగ్గా తీసుకుంటాడు.
పదవి కోసమే నాటకాలు...
పదవి కోసమే రిషి బతికి ఉన్నాడని నువ్వు నాటకం ఆడుతున్నావని, ఎండీ సీట్‌లో పర్మినెంట్‌గా కూర్చోవాలనే ఇలా కలరింగ్ ఇస్తున్నావని వసుధారను తన మాటలతో ఇబ్బంది పెడతాడు శైలేంద్ర. ఎండీగా హోదా, దర్జా అనుభవించడం కోసం కన్నీళ్లు, క్షోభ పెట్టుకున్నట్లుగా రిషిపై ప్రేమ ఉన్నట్లుగా డ్రామాలు ఆడుతున్నావని వసుధార మనసు నొప్పిస్తాడు శైలేంద్ర. అతడి మాటలతో వసుధార ఎమోషనల్ అవుతుంది. తనకు నీలా పదవి పిచ్చి లేదని శైలేంద్రకు సమాధానమిస్తుంది.
ఎండీ సీట్ కోరుకోలేదు...
వసుధార ఎప్పుడూ ఎండీ సీట్‌ను కోరుకోలేదని, రిషినే వసుధారకు ఈ బాధ్యతలను అప్పగించాలని మహేంద్ర అంటాడు. . వసుధారకు ఎండీ బాధ్యతలు అప్పగించి తప్పుచేశానని రిషి అనుకుంటున్నాడని, అందుకే అతడు మీ దగ్గరకు రావడం లేదని మహేంద్రను ఎగతాళి చేస్తాడు శైలేంద్ర. ఇకపై రిషి రాడని అంటాడు. శైలేంద్ర మాటలతో వసుధార, మహేంద్ర కోపం పట్టలేకపోతాడు.
మను ఎంట్రీ...
అప్పుడే అక్కడికి మను ఎంట్రీ ఇస్తాడు. ఇక నీ మాటలు ఆపుతావా అని కోపంగా శైలేంద్రతో అంటాడు మను. కానీ అతడి వార్నింగ్‌ను శైలేంద్ర తేలిగ్గా తీసుకుంటాడు. తండ్రి ఎవరో తెలుసుకోవాలనే గోల్ నీ ముందు ఉంది. అది వదిలిపెట్టి అనవసరంగా మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని మనుకు బదులిస్తాడు శైలేంద్ర. నువ్వు కూడా రిషి జాడ తెలుసుకునేందుకు తెగ వెతికావు. అయినా ఏ ప్రయోజనం లేదు. నువ్వైనా రిషి రాడని వసుధార, మహేంద్రలకు చెప్పు అని మనుతో అంటాడు శైలేంద్ర. రిషి వస్తాడనే నమ్మకం తనకు ఉందని మను కూడా ఉంటాడు.
రోజులే గడువు...
రిషి వస్తాడు అనుకుంటూ నెలలు గడిచాయి. ఇక నీకు రోజులు మాత్రమే గడువు ఉంది. రిషిని తిరిగి తీసుకురాకపోతే కాలేజీని వదిలిపెడతానని చెప్పిన మాట మీద నిలబడాలి అని శైలేంద్ర అంటాడు. రిషి నిజంగా బతికి ఉంటే వసుధారతో పాటు నిన్ను ఎందుకు కలవడం లేదని మహేంద్రను నిలదీస్తాడు శైలేంద్ర. రిషి లేడని తెలుసుకుంటే మంచిదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పేపర్‌లో ప్రకటన...
రిషి కనిపించడం లేదని పేపర్‌లో ప్రకటన ఇస్తుంది వసుధార. సుధార ఇచ్చిన పేపర్ యాడ్‌ను భర్తతో పాటు శైలేంద్ర, ధరణిలకు చూపిస్తుంది దేవయాని. ఆ యాడ్ చూసి శైలేంద్ర షాకవుతాడు. ఇదే ఛాన్స్‌గా వసుధార, మహేంద్రలపై ఫణీంద్రకు చాడీలు చెబుతారు దేవయాని, శైలేంద్ర. రిషి లేడని ఎంత చెప్పిన వసుధార నమ్మడం లేదని, భూషణ్ ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తుందని, ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతకు తెగిస్తుందో అని దేవయాని అంటుంది. ఎండీ సీట్ కోసమే వసుధార ఈ డ్రామా ఆడుతుందని, రిషి మీద తనకు ఎలాంటి ప్రేమ లేదని వసుధార గురించి దేవయాని ఇష్టానుసారం మాట్లాడుతుంది.
ఫణీంద్ర సీరియస్...
దేవయాని మాటలపై ఫణీంద్ర కోప్పడుతాడు. రిషి కోసం వసుధార పడుతోన్న బాధ, ఆవేదన మాత్రమే ఈ పేపర్ యాడ్‌లో తనకు కనిపిస్తున్నాయని ఫణీంద్ర అంటాడు. నువ్వు మారవా...ఎదుటివాళ్ల ఎమోషన్స్, బాధ గురించి ఆలోచించవా అంటూ కోప్పడుతాడు. భూషణ్ ఫ్యామిలీకి పట్టిన పెద్ద భూతానివి నువ్వే అంటూ భార్యపై విరుచుకుపడతాడు.
వసుధార ఆనందం...
తాను ఇచ్చిన పేపర్ ప్రకటనను చూసి ఎవరో ఒకరు రిషి క్షేమసమాచారాల గురించి ఫోన్ చేస్తారని వసుధార ఆత్రుతగా ఎదురుచూస్తుంటుంది. రిషి రాకపోతే కాలేజీ శైలేంద్ర సొంతం అవుతుందని, అదే జరిగితే విద్యార్థుల భవిష్యత్తుతో పాటు కాలేజీ పతనం అవుతుందని వసుధార కంగారు పడుతుంది. ఆమెను మను ఓదార్చుతాడు మను. తప్పకుండా రిషి తిరిగి వస్తాడని అంటాడు. ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను రిషిని చూశానని చెబుతాడు. అతడి మాటలు వినగానే వసుధార పొంగిపోతుంది. అతడు చెప్పిన పోలికలు చూసి రిషినే అని వసుధార ఫిక్సవుతుంది. అడ్రెస్ కనుక్కొని మనుతో కలిసి అక్కడికి వెళుతుంది.
ఫేక్ కాల్...
కానీ అక్కడ రిషి కాకుండా శైలేంద్ర కనిపిస్తాడు. రిషి గురించి తెలుసు అని తమకు ఫేక్ కాల్ శైలేంద్రనే చేయించి ఉంటాడని వసుధార, మను ఫిక్సవుతారు. మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం శైలేంద్రకు అలవాటేనని మనుతో అంటుంది వసుధార. కోపంగా శైలేంద్ర దగ్గరకు వచ్చి చెంప పగలగొడతానని హెచ్చరిస్తుంది.అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.