Guppedantha Manasu Serial: శైలేంద్రను వణికించిన రంగా - రిషి కోసం దేవయాని ఆరాలు - వసు లైఫ్‌లోకి విలన్స్ రీఎంట్రీ!
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు జూలై 19 ఎపిసోడ్‌లో రంగా పోలికలతో ఉన్నది రిషినో కాదో తెలుసుకోవాలని ఫిక్సవుతారు శైలేంద్ర, దేవయాని. ధన్‌రాజ్‌కు ఇష్టంలేకపోయినా బలవంతంగా అతడిని పెళ్లిచూపులకు తీసుకెళతారు. అక్కడ రంగాను చూసి ఇద్దరు షాకవుతారు.

Guppedantha Manasu Serial: సరోజను పెళ్లిచేసుకోవాలని ధన్‌రాజ్ ఆశపడతాడు. పెళ్లిచూపులకు ధన్‌రాజ్‌తో కలిసి శైలేంద్ర, దేవయాని వస్తారు. రంగాపై ఇష్టంతో ఈ పెళ్లిచూపులను చెడగొట్టాలని బుజ్జితో కలిసి సరోజ ప్లాన్ చేస్తుంది. ఊరి మొదట్లోనే ధన్‌రాజ్ కారును బుజ్జి అడ్డగిస్తాడు. రంగాతో సరోజ క్లోజ్‌గా కలిసి దిగిన ఫొటోలను వారికి చూపిస్తాడు. ఆ ఫొటోలో రిషి పోలికలతో ఉన్న రంగాను చూసి దేవయాని, శైలేంద్ర షాకవుతారు. బుజ్జి ద్వారా రంగా వివరాలు ఆరా తీస్తారు.
రంగానే రిషి...
ఆ ఫొటోలో సరోజతో ఉన్నది రిషినే అని దేవయాని అనుమానపడుతుంది. రిషి కనిపించకుండాపోయాడు కానీ చనిపోలేదు కదా. ఎవరికి తెలియకుండా అతడే ఇక్కడ ఉంటున్నాడు కావచ్చునని శైలేంద్రతో అంటుంది దేవయాని. ఫొటోలో సరోజ, రంగా క్లోజ్‌నెస్ చూసి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ధన్‌రాజ్ అనుమానపడతాడు.
పెళ్లిచూపులు చూడకుండానే వెనక్కి వెళ్లిపోదామని శైలేంద్రతో అంటాడు ధన్‌రాజ్. కానీ రంగా గురించి ఆరాతీయాడానికైనా ఈ పెళ్లిచూపులకు వెళ్లాలని దేవయాని ఫిక్సవుతుంది. ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయని, బుజ్జి చెప్పించి నిజమో కాదో తెలియడానికైనా పెళ్లిచూపులకు వెళదామని బలవంతంగా ధన్‌రాజ్‌ను ఒప్పిస్తారు. ఈ పెళ్లిచూపుల ద్వారా రంగానే రిషినో కాదో తెలుసుకోవాలని అనుకుంటారు.
రంగా గురించి ప్రశ్నలు...
రంగా గురించి శైలేంద్ర పదే పదే బుజ్జిని అడగటం చూసి ధన్‌రాజ్ అనుమానపడతాడు. అతడి గురించి ఎందుకు అడుగుతున్నారని అంటాడు. శైలేంద్ర మాత్రం సమాధానమివ్వడు. పెళ్లిచూపులను చెడగొట్టడానికి బుజ్జితో కలిసి వేసిన ప్లాన్ ఫెయిలవ్వడంతో సరోజ కంగారు పడుతుంది.
సరోజ ఇంటికి వస్తాడు ధన్‌రాజ్. సంజీవకు దేవయాని, శైలేంద్రలను మేడమ్, సార్ అని పరిచయం చేస్తాడు ధన్‌రాజ్. అది చూసి సంజీవ కంగారుపడతాడు. చిన్నప్పటి నుంచి తల్లి తనకు మొదటి గురువుగా ఉందని, అందుకే మేడమ్ అని పిలవడం అలవాటైందని ధన్‌రాజ్ కవర్ చేస్తాడు. తమ్ముడి చేత సార్ అని పిలుపించుకోవడం తనకు ఇష్టమని శైలేంద్ర అబద్ధం ఆడుతాడు.
శైలేంద్ర ఇన్వేస్టిగేషన్...
పెళ్లిచూపుల్లో సంజీవ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే రంగా కోసం ఇంట్లో వెతుకుంటుంటారు దేవయాని, శైలేంద్ర. వారి వాలకం చూసి నా పెళ్లిచూపుల కోసం వచ్చారా? ఏదైనా పరిశోధన కోసం వచ్చారా అని ధన్‌రాజ్‌కూడా అనుమానపడతాడు.
ఆస్తిలో పోలిక లేదు.
సరోజకు రంగా అనే బావ ఉన్నాడటగా అని సంజీవను అడుగుతుంది దేవయాని. రంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడని సంజీవ ఆమెకు బదులిస్తాడు. పేరుకే బంధువులం కానీ ఆస్తిలో, హోదాలోనే కాకుండా ఎందులోనూ తమకు రంగాకు పోలిక లేదని దేవయానితో అంటాడు సంజీవ. సరోజ తో రంగాకు అతడితో ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. రంగాను కూడా పెళ్లిచూపులకు రమ్మని చెప్పానని దేవయానికి చెబుతాడు సంజీవ.
వసుధార అనుమానాలు...
సరోజ పెళ్లిచూపుల కార్యక్రమానికి రంగా వెళ్లడం వసుధారకు ఇష్టం ఉండదు. ఆ పెళ్లిచూపులకు మీరు వెళ్లడం అవసరమా అని అంటుంది. సరోజ ఈ పెళ్లిచూపులను చెడగొట్టాలని చూస్తుందని, అలా జరగకుండా ఉండాలనే వెళుతున్నానని రంగా అంటాడు. పెళ్లివాళ్లతో తాను, సరోజ బావమరదళ్లం మాత్రమేనని, మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబితే గొడవ సెట్టైపోతుందని వసుధార అనుమానాలను రంగా క్లియర్ చేస్తాడు.
రంగా ఎంట్రీ...
రంగాకు రాధమ్మ ఫోన్ చేసి సరోజ పెళ్లిచూపుల దగ్గరకు వెంటనే రమ్మని అంటుంది. వసుధారను తీసుకొని సరోజ ఇంటికి బయలుదేరుతాడు రంగా. మరోవైపు సరోజ పెళ్లిచూపుల్లో కూర్చున్న ఆమెను చూడటానికి ధన్‌రాజ్ ఇష్టపడడు. అప్పుడే రిషి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడిని చూసి శైలేంద్ర, దేవయాని షాకవుతారు. రంగా దగ్గరకు రాగానే ఇద్దరు లేచి నిలబడతారు. అది చూసి సంజీవ ఆశ్చర్యపోతాడు.
వణికిపోయిన శైలేంద్ర...
నువ్వు రిషివా అని రంగానే అడగాలని అనుకుంటాడు శైలేంద్ర. కానీ మాట రాదు. రి...రి అంటూ తడబడిపోతాడు. రంగాను చూసి వణికిపోతుంటాడు. చెమటలతో తడిసిపోతాడు. ఏసీ లేకుండానే ఎందుకు వణుకుతున్నారని శైలేంద్రను అడుగుతాడు రంగా. కారులో ఏసీ ఎక్కువగా పెట్టుకొని వచ్చామని దేవయాని అబద్ధం ఆడుతాడు.
శైలేంద్ర, దేవయానిలకు తనను తాను పరిచయం చేసుకుంటాడు రంగా. సరోజ ఇంట్లో నుంచి శైలేంద్ర, దేవయాని వాయిస్‌లు వినిపించడం వసుధారకు అనుమానం వస్తుంది. వారేనా కాదా కన్ఫామ్ చేసుకోవడానికి ఇంట్లోకి తొంగిచూడబోతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.