Samantha: ఆ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు-is samantha ruth prabhu in love with citadel honey bunny director raj nidimoru rumours circulating on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: ఆ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు

Samantha: ఆ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 07:36 PM IST

Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత విషయంలో మరోసారి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఓ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు బయటికి వచ్చాయి. ఇప్పటికే తాను రెండు వెబ్ సిరీస్‍లు చేసిన ఆ దర్శకుడితో ఆమె లవ్‍లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Samantha: ఆ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు
Samantha: ఆ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు

టాలీవుడ్ హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య ఎంగేజ్‍మెంట్ గత వారంలోనే జరిగింది. హీరోయిన్ సమంతతో 2021లో విడిపోయిన చైతూ.. ఇప్పుడు శోభితా ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా ప్రేమిస్తున్న శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు నాగచైతన్య. కాగా, సమంత కూడా మరో వ్యక్తితో ప్రేమలో పడ్డారంటూ తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీమ్యాన్, సిటాడెల్: హన్నీబన్నీ వెబ్ సిరీస్‍ల దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‍లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి.

రూమర్లు ఎక్కడ మొదలయ్యాయంటే..

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ రెడిట్‍లో ముందుగా రూమర్లు షురూ అయ్యాయి. ఇవి కాసేపటికే వైరల్ అయ్యాయి. సమంత, రాజ్ కలిసి ఇటీవలే సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ చేశారు. దర్శకద్వయం రాజ్, డీకేల్లో రాజ్ అంటే ఆయనే. రాజ్ నిడిమోరు తెలుగు వ్యక్తే.

ఇప్పటికే రెండు.. మూడో సిరీస్ కూడా..

రాజ్ నిడిమోరు, కృష్ణ దాసరకొత్తపల్లి (రాజ్ & డీకే) దర్శకత్వంలో సమంత ఇప్పటి రెండు వెబ్ సిరీస్‍ల్లో నటించారు. ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్‍లో సమంత ఓ కీలకపాత్ర చేశారు. తన నటనతో మెప్పించారు. వీరి డైరెక్షన్‍లోనే సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍లో లీడ్ రోల్ చేశారు సామ్. ఈ సిరీస్ సమయంలోనే దర్శకుడు రాజ్‍కు సమంత దగ్గరయ్యారనే రూమర్లు ఇప్పుడు వస్తున్నాయి. వారు ప్రస్తుతం డేటింగ్‍లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి.

రాజ్, డీకే క్రియేటర్లు, నిర్మాతలుగా రానున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‍లోనూ సమంత ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్‍లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా నటించనున్నారు. అయితే, ఈ సిరీస్‍కు తుంబాడ్ ఫేమ్ అనిల్ బార్వే దర్శకత్వం వహించనున్నారు.

దర్శకులు రాజ్ నిడమోరు, డీకే తెలుగు వారే. అయితే, బాలీవుడ్ సినిమాలే చేశారు. 2019లో వీరు తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో వీరి పేరు మార్మోగింది. సీజన్ 2 కూడా అదే రేంజ్‍లో సక్సెస్ అయింది. వీరు రూపొందించిన ఫర్జీ సిరీస్ కూడా సూపర్ సక్సెస్ అయింది. సిటాడెల్: హనీబన్నీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.

నాగచైతన్య, సమంత కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2017 జనవరిలో వీరి ఎంగేజ్‍మెంట్ జరిగింది. అదే ఏడాది అక్టోబర్ నెలలో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్‍లో మంచి జంటగా చైతూ, సమంతకు పేరొచ్చింది. చాలా అన్యూన్యంగా కనిపించేవారు. అయితే, విభేదాలు రావడంతో వీరు 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2022లో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్‍లోకి వెళ్లారు నాగచైతన్య. గత వారంలోనే చైతూ - శోభిత ఎంగేజ్‍మెంట్ జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకే.. డైరెక్టర్ రాజ్‍తో సమంత ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై సమంత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మయోసైటిస్ కారణంగా సుమారు ఏడాదిగా సినిమాలను దూరంగా ఉంటున్నారు సమంత. గతేడాది సెప్టెంబర్‌లో చివరగా ఖుషి చిత్రంలో కనిపించారు. త్వరలోనే ఆమె రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్‍లో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే, తాను స్టార్ట్ చేసిన త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తొలి చిత్రంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని కూడా ఆమె ప్రకటించారు. ఈ మూవీలో సమంత లీడ్ రోల్ చేయనున్నారు.

Whats_app_banner