Samantha Web Series: తుంబాడ్ డైరెక్టర్‌తో వెబ్ సిరీస్ చేయనున్న సమంత.. టైటిల్ ఇదే!-samantha ruth prabhu set to do another web series with raj and dk rakht brahmand for netflix ott aditya roy kapur ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Web Series: తుంబాడ్ డైరెక్టర్‌తో వెబ్ సిరీస్ చేయనున్న సమంత.. టైటిల్ ఇదే!

Samantha Web Series: తుంబాడ్ డైరెక్టర్‌తో వెబ్ సిరీస్ చేయనున్న సమంత.. టైటిల్ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 20, 2024 04:44 PM IST

Samantha Ruth Prabhu: సమంత మరో వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ సూడా ఈ సిరీస్‍లో నటించనున్నారని సమాచారం. ఇప్పటికే టైటిల్ కూడా బయటికి వచ్చేసింది.

Samantha Ruth Prabhu: మరో వెబ్ సిరీస్ చేయనున్న సమంత.. టైటిల్ ఇదే!
Samantha Ruth Prabhu: మరో వెబ్ సిరీస్ చేయనున్న సమంత.. టైటిల్ ఇదే!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. డైరెక్టర్లు రాజ్, డీకే సంయుక్తంగా దర్శకత్వం వహించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్‍లో సమంత మెయిన్ రోల్ చేశారు. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. అయితే, ఈలోగానే మరో వెబ్ సిరీస్ చేసేందుకు సమంత ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‍కు రాజ్, డీకే పని చేయనున్నారు. అయితే, దర్శకులుగా కాకుండా షో రన్నర్లుగా ఉండనున్నారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ కూడా బయటికి వచ్చింది.

టైటిల్, జోనర్ ఇవే!

ఈ వెబ్ సిరీస్‍లో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సిరీస్‍కు ‘రక్త బ్రహ్మాండ్’ అని టైటిల్ ఖరారు చేసినట్టుగా సమాచారం బయటికి వచ్చింది. ముందుగా రక్తబీజ్ అని టైటిల్ అనుకన్నారట. అయితే, దాన్ని తాజాగా రక్త బ్రహ్మాండ్ అని మార్చినట్టు తెలుస్తోంది.

రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ పీరియడ్ ఫ్యాంటసీ డ్రామాగా రూపొందనుంది. ఆదిత్య రాయ్ కపూర్, సమంతతో పాటు ఈ సిరీస్‍లో బాలీవుడ్ నటి వామికా గబ్బీ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం బయటికి వచ్చింది.

తుంబాడ్ డైరెక్టర్‌తో..

రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‍కు తుంబాడ్ ఫేమ్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించనున్నారు. 2018లో వచ్చిన ఫ్యాంటసీ హారర్ సినిమా తుంబాడ్ చాలా ప్రశంసలను దక్కించుకుంది. బార్వే ఈ సిరీస్‍కు దర్శకత్వం చేయడం మరింత ఇంట్రెస్టింగ్‍గా ఉంది. అతడికి ఇదే తొలి సిరీస్‍గా ఉండనుంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి సక్సెస్‍ఫుల్ సిరీస్‍లను రూపొందించిన డైరెక్టర్లు రాజ్, డీకే షోరన్నర్లుగా వ్యవహరించనున్నారు.

రక్త బ్రహ్మాండ్‍ను ముందుగా సినిమాగా చేయాలని మేకర్స్ భావించారట. కానీ ఇంత పెద్ద కథను చిత్రంగా తీసుకొస్తే మొత్తంగా చెప్పలేమనే ఉద్దేశంతో వెబ్ సిరీస్‍ చేయాలని భావించారని టాక్. ఎక్కువ బడ్జెట్‍తో, భారీ వీఎఫ్‍ఎక్స్‌తో ఈ సిరీస్ ఉంటుందని తెలుస్తోంది. ప్రేమ, త్యాగం, మోసం, దోపిడీ ఇలా చాలా అంశాలు ఈ ఫ్యాంటసీ సిరీస్‍లో ఉంటాయని సమాచారం.

ఏ ఓటీటీలో..

రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కోసం ఆరు నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ఈ సిరీస్ షూటింగ్ మొదలుకానుందని అంచనా. 2025 రెండో అర్ధభాగంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

మయోసైటిస్‍తో బాధపడుతున్న సమంత సుమారు 10 నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చివరగా గతేడాది ఖుషి చిత్రంలో కనిపించారు. విజయ్ దేవరకొండ సరసన ఆ మూవీలో హీరోయిన్‍గా చేశారు సమంత. ఆ తర్వాతి నుంచి చికిత్స తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు విదేశాలకు వెకేషన్లకు వెళుతున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించిన సమంత.. ఇప్పటి వరకు ఈ మూవీని మొదలుపెట్టలేదు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తొలి ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని సమంత చేయనున్నారు. ఫస్ట్ లుక్ తర్వాత ఈ మూవీపై ఎలాంటి అప్‍డేట్ వెల్లడికాలేదు. మరి సమంత ముందు ఈ చిత్రం చేస్తారా.. రక్త బ్రహ్మాండ్ సిరీస్‍తో మళ్లీ యాక్టింగ్ షురూ చేస్తారా అనేది చూడాలి.

Whats_app_banner