Kushi OTT Details: గెట్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రేపే: వివరాలివే-kushi movie ott steaming details where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Ott Details: గెట్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రేపే: వివరాలివే

Kushi OTT Details: గెట్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రేపే: వివరాలివే

Kushi OTT Details: విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఖుషి సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. రేపు (అక్టోబర్ 1) ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలివే..

Kushi OTT Details: గెట్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రేపే

Kushi OTT Details: లవ్ రొమాంటింక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఈ మూవీ రేపు (అక్టోబర్ 1) ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఫీల్ గుడ్ చిత్రాలకు ఫేమస్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించగా.. హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఖుషి విజయం సాధించలేకపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన నెలకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది.

ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రేపు (అక్టోబర్ 1) అర్ధరాత్రి 12 గంటలకు ఖుషి సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ఇటీవలే ప్రకటించింది. కాగా, ఖుషి రేపే ఓటీటీలోకి అందుబాటులోకి రానుండడంతో మరోసారి గుర్తు చేసింది. ఖుషి సినిమా రేపు (అక్టోబర్ 1) తమ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు రోజులు మంచి కలెక్షన్లు వచ్చినా.. ఆ తర్వాత డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా సుమారు రూ.15కోట్ల వరకు నష్టాన్ని మూటగట్టుకుందని ట్రేడ్ పండితులు తేల్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. ఖుషి సినిమాలో సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, జయరాం, రోహిణి, వెన్నెల కిషోర్ కీరోల్స్ చేశారు.

ఖుషి కథ ఇదీ

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉండే విప్లవ్ (విజయ్ దేవరకొండ).. కశ్మీర్‌లో ఆరాధ్య (సమంత)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఇద్దరి కుటుంబాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. దీంతో విప్లవ్, ఆరాధ్య వివాహానికి ఒప్పుకోరు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకొని బయటికి వెళ్లి సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే, వివాహం అయిన కొన్నాళ్లకే విప్లవ్, ఆరాధ్య మధ్య గొడవలు తరచూ గొడవలు జరుగుతాయి. ఇవి కాస్త పెద్దవవుతాయి. దీంతో ఇద్దరూ విడిపోతారు. మానసిక సంఘర్షణకు గురవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి.. విప్లవ్, ఆరాధ్య మళ్లీ ఇద్దరు కలిశారా.. అనేదే ఖుషి సినిమా కథ.