Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్
Samantha Next Movie - Bangaram: సమంత ఎట్టకేలకు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సుమారు ఏడు నెలలుగా బ్రేక్ తీసుకుంటున్న ఆమె.. తన తదుపరి మూవీని ప్రకటించారు. టైటిల్‍తో పాటు పోస్టర్ కూడా తీసుకొచ్చారు.
Samantha Next Movie: స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె బ్రేక్ తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ఖుషి తర్వాత మళ్లీ ఏ మూవీ చేయలేదు. దీంతో సమంత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు సమంత గుడ్‍న్యూస్ చెప్పారు. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. నేడు (ఏప్రిల్ 28) తన పుట్టిన రోజు సందర్భంగా తర్వాతి సినిమాను వెల్లడించారు.
టైటిల్ ఇదే
తన తర్వాతి సినిమా ‘మా ఇంటి బంగారం’ను సమంత అనౌన్స్ చేశారు. ఈ మూవీలో తాను బంగారం పాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సినిమా టైటిల్‍లో బంగారం అని పెద్దగా ఉండగా.. దానిపై ‘మా ఇంటి’ చిన్నగా రాసి ఉంది.
ఇంట్రెస్టింగ్‍గా పోస్టర్
‘మా ఇంటి బంగారం’ సినిమా పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా సమంత నటిస్తున్నారని అర్థమవుతోంది. వంట గదిలో సమంత తుపాకీ పట్టుకున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఒంటిపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఈ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మొత్తంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతోనే ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది.
నిర్మాత కూడా సమంతనే..
ఈ మూవీని సమంతనే నిర్మిస్తున్నారు. తన ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేయనున్నారు. గతేడాది డిసెంబర్లోనే ఈ బ్యానర్‌ను ఆమె స్థాపించారు. ఇప్పుడు తన పతాకంపైనే ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అయితే, మా ఇంటి బంగారం సినిమా గురించి ఇతర వివరాలను సమంత ఇప్పుడు వెల్లడించలేదు. దర్శకుడు ఎవరనేది కూడా ప్రకటించలేదు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. బంగారుమయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదని క్యాప్షన్ రాశారు.
స్టార్ హీరోయిన్‍గా వెలుగొందుతున్న సమయంలోనే మయోసైటిట్ వ్యాధి బారిన పడ్డారు సమంత. రెండేళ్ల నుంచి ఆమె ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మయోసైటిస్ వచ్చిన తర్వాత కూడా యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలను చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో ఖుషి తర్వాత బ్రేక్ తీసుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం సమంత యాక్టివ్‍గా ఉంటూనే ఉన్నారు. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంలో సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
సమంత ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. ఈ సిరీస్‍లో వరుణ్ ధావన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. రాజ్, డీకే ఈ స్పైయాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావాల్సి ఉంది. అమెరికన్ సిటాడెల్‍కు ఇది ఇండియన్ వెర్షన్‍గా రూపొందింది. ఈ సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍లో వరుణ్, సమంతతో పాటు సికిందర్ ఖేర్, ఎమ్మా క్యానింగ్, కేకే మీనన్ కీలకపాత్రలు చేశారు. ఈ సిరీస్ షూటింగ్ గతంలోనే పూర్తయింది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో ప్రకటించే అవకాశం ఉంది.