Premalu TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-premalu tv premier date super hit malayalam romantic comedy movie premalu world television premier on zee telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Tv Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Premalu TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Aug 14, 2024 03:25 PM IST

Premalu TV Premier Date: సూపర్ డూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ.. వచ్చే ఆదివారం (ఆగస్ట్ 18) టెలికాస్ట్ కానుంది.

టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Premalu TV Premier Date: మలయాళం బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు టీవీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లు, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇక టీవీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాను వచ్చే ఆదివారం టెలికాస్ట్ చేయనున్నట్లు జీ తెలుగు ఛానెల్ వెల్లడించింది. అంతేకాదు ఆదివారం శ్రావణలక్ష్మి పేరుతో మరో ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ ను కూడా ఈ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ప్రేమలు టీవీ ప్రీమియర్ డేట్

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చే ఆదివారం (ఆగస్ట్ 18) సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ విషయాన్ని సదరు ఛానెల్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

నస్లెన్ గఫూర్, మమితా బైజు నటించిన ఈ ప్రేమలు మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మలయాళంలోనే కాదు తెలుగులోనూ రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా నిలిచింది. తర్వాత ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాగా.. అక్కడా మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది.

జీ తెలుగులో శ్రావణలక్ష్మి

ప్రేమలు మూవీ ఒక్కటే కాదు.. ఈ ఆదివారం జీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో ప్రోగ్రామ్ కూడా సిద్ధంగా ఉంది. శ్రావణలక్ష్మి పేరుతో సిద్ధమైన ఈ ప్రోగ్రామ్ ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఆదోనీలో ఇప్పటికే నిర్వహించిన ఈ ఈవెంట్ ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ ఈవెంట్ కు లాస్య హోస్ట్ గా వ్యవహరించింది.

అంతేకాదు ఇందులో జీ తెలుగు పాపులర్ సీరియల్స్ మా అన్నయ్య, జాబిల్లి కోసం ఆకాశమల్లె స్టార్లు కూడా పాల్గొన్నారు. వీళ్లందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూనే రక్షాబంధన్ వేడుకలను కూడా జరుపుకున్నారు. సరిగమప సింగర్స్ లక్ష్మి గాయత్రి, సమీర పాటలతోపాటు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అదిరిపోనున్నాయి. 

అభిమానుల కోలాహలంతో నిండిన ఈ వేదికపై మా అన్నయ్య సీరియల్​ జంట గంగ(గోకుల్​ మీనన్​)-శివ(స్మృతి కశ్యప్​) వివాహతంతు ఘనంగా జరిగింది. ఈ వివాహానికి లాస్య పురోహితుడి పాత్ర పోషించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.

జీ తెలుగు తారలు, అభిమానులతో సంగ్రామంలా సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య​అతిథిగా ఆదోని శాసనసభ సభ్యులు పీ.వీ. పార్థసారథి హాజరై అందరిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ వేదికపై నిరుపేదల కోసం సోషల్ వెల్ఫేర్ సొసైటీని నిర్వహిస్తూ ప్రజాసంక్షేమం, సేవ కోసం పాటుపడుతున్న సునీతను సన్మానించారు.