OTT Malayalam Romantic Comedy: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూడండి-ott malayalam romantic comedy movie little hearts now streaming on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Romantic Comedy: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూడండి

OTT Malayalam Romantic Comedy: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూడండి

Hari Prasad S HT Telugu
Aug 13, 2024 10:38 AM IST

OTT Malayalam Romantic Comedy: సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం (ఆగస్ట్ 13) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూడండి
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూడండి

OTT Malayalam Romantic Comedy: ఓటీటీలోకి ఇప్పుడు మరో హిట్ మలయాళం మూవీ వచ్చింది. రెండు నెలల కిందట అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించిన లిటిల్ హార్ట్స్ మూవీ మంగళవారం (ఆగస్ట్ 13) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. షేన్ నిగమ్, మహిమా నంబియార్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

లిటిల్ హార్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం మూవీ లిటిల్ హార్ట్స్ ను ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రీసా పాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రొడ్యూసర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "సినిమా వచ్చేస్తోంది. లిటిల్ హార్ట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ (సోమవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది" అని వెల్లడించారు. చెప్పినట్లుగానే ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

లిటిల్ హార్ట్స్ కథ ఇదీ

ఈ లిటిల్ హార్ట్స్ మూవీ జూన్ 7న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ లిటిల్ హార్ట్స్ మూవీ మూడు ప్రేమ కథల చుట్టూ తిరుగుతుంది. సినిమాలో లీడ్ రోల్స్ అయిన సిబి (షేన్ నిగమ్), సోషా (మహిమా నంబియార్) లవ్ స్టోరీతోపాటు సిబి తండ్రి బేబీ లవ్ స్టోరీ, సోషా సోదరుడు షారోన్ (షైన్ టామ్ చాకో) లవ్ స్టోరీలే ఈ సినిమా కథ.

నిజానికి ఈ సినిమా చాలా వరకు లీడ్ రోల్స్ మధ్య లవ్ స్టోరీ కాకుండా మిగతా రెండు జంటల స్టోరీ చుట్టే ఎక్కువగా తిరగడం విశేషం. ప్రేమ అంటే ప్రేమే.. ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే అన్ని రకాల బంధాలూ సరైనవిగానే అనిపిస్తాయన్న సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ కాన్సెప్ట్ కొందరు ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది.

కానీ ఐఎండీబీలో మాత్రం ఈ సినిమాకు 8.2 రేటింగ్ దక్కడం విశేషం. సాధారణంగా చాలా మంచి సినిమాలకే ఈ రేటింగ్ లభిస్తుంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ లిటిల్ హార్ట్స్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి కేవలం మలయాళం ఆడియోతోనే మూవీని చూడొచ్చు. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండటంతో మలయాళం సినిమాలను మెచ్చే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీని చూసేయొచ్చు.

Whats_app_banner