Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన సినిమాలు ఇవే.. మలయాళం, తమిళ డబ్బింగ్‌వే ఎక్కువ-weekend telugu ott releases malayalam tamil dubbing movies on ott aha video etv win prime video netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Telugu Ott Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన సినిమాలు ఇవే.. మలయాళం, తమిళ డబ్బింగ్‌వే ఎక్కువ

Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన సినిమాలు ఇవే.. మలయాళం, తమిళ డబ్బింగ్‌వే ఎక్కువ

Hari Prasad S HT Telugu

Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి చాలానే తెలుగు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువగా మలయాళం, తమిళ డబ్బింగ్ సినిమాలే ఉండటం విశేషం.

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి తెలుగులో వచ్చిన సినిమాలు ఇవే.. మలయాళం, తమిళ డబ్బింగ్‌వే ఎక్కువ

Weekend Telugu OTT Releases: వీకెండ్ వస్తే చాలు ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం వెతకడం ఇప్పుడు కామనైపోయింది. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖ ఓటీటీలు ఆహా, ఈటీవీ విన్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిలో వీటిని చూడొచ్చు.

వీకెండ్ తెలుగు ఓటీటీ రిలీజెస్

వీకెండ్ తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి? ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూడండి.

బర్త్‌డే బాయ్ - ఆహా వీడియో

థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు క్రైమ్ కామెడీ మూవీ బర్త్‌డే బాయ్. ఈ మూవీ శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

భారతీయుడు 2 - నెట్‌ఫ్లిక్స్

భారీ అంచనాల మధ్య జులై 12న థియేటర్లలో రిలీజైన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. దీంతో నెల రోజుల లోపే ఈ భారీ బడ్జెట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

చందు ఛాంపియన్ - ప్రైమ్ వీడియో

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చందు ఛాంపియన్. ఈ సినిమా కొన్నాళ్ల కిందట రెంట్ తీసుకొని చూసేలా ఓటీటీలోకి వచ్చింది. అయితే శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా చూడొచ్చు.

బర్త్‌మార్క్ - ఆహా వీడియో

ఇక తమిళ సినిమా బర్త్‌మార్క్ కూడా తెలుగులో ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఓటీటీలో అడుగుపెట్టిన ఈ సినిమాలో షబ్బీర్ కల్లారక్కల్, మిర్నా మేనన్ నటించారు.

డి బ్లాక్ - ఈటీవీ విన్

డి బ్లాక్ కూడా తమిళ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమానే. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వన్ ఫాస్ట్ మూవ్ - ప్రైమ్ వీడియో

వన్ ఫాస్ట్ మూవ్ ఓ ఇంగ్లిష్ మూవీ. ఈ సినిమా కూడా తెలుగులోకి డబ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

లిటిల్ మిస్ రాథర్ - ప్రైమ్ వీడియో

మలయాళ రొమాంటిక్ డ్రామా ఈ లిటిల్ మిస్ రాథర్. ఓ పొట్టి అమ్మాయి, పొడుగు అబ్బాయి మధ్య సాగే ఫన్నీ లవ్ స్టోరీ. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా - నెట్‌ఫ్లిక్స్

మూడేళ్ల కిందట వచ్చిన హసీన్ దిల్‌రుబా మూవీకి ఇది సీక్వెల్. తాప్సీ నటించిన బోల్డ్ మూవీ ఇది. ఈ సినిమా తెలుగులోనూ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

టర్బో - సోనీలివ్

మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ టర్బో. గురువారం (ఆగస్ట్ 8) నుంచే ఈ సినిమా తెలుగులోనూ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.