Box Office Collection: ఊపందుకున్న చందు ఛాంపియన్ కలెక్షన్స్.. 70 కోట్లు దాటేసిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ-kartik aaryan starrer chandu champion 12 days worldwide box office collection crossed 72 cr gross box office report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Box Office Collection: ఊపందుకున్న చందు ఛాంపియన్ కలెక్షన్స్.. 70 కోట్లు దాటేసిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ

Box Office Collection: ఊపందుకున్న చందు ఛాంపియన్ కలెక్షన్స్.. 70 కోట్లు దాటేసిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ

Sanjiv Kumar HT Telugu
Jun 26, 2024 11:47 AM IST

Chandu Champion 12 Days Box Office Collection: ఎట్టకేలకు చందు ఛాంపియన్ సినిమాకు కలెక్షన్స్ ఊపందుకున్నాయి. 11వ రోజుతో పోలిస్తే 12వ రోజు కలెక్షన్స్ పెరిగాయి. స్పోర్ట్స్ బయోపిక్ చిత్రంగా వచ్చిన చందు ఛాంపియన్ 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

ఊపందుకున్న చందు ఛాంపియన్ కలెక్షన్స్.. 70 కోట్లు దాటేసిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ
ఊపందుకున్న చందు ఛాంపియన్ కలెక్షన్స్.. 70 కోట్లు దాటేసిన స్పోర్ట్స్ బయోపిక్ మూవీ

Chandu Champion Worldwide Collection: మొన్నటివరకు మందకోడిగా సాగిన చందు ఛాంపియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. ట్రేడ్ వెబ్‌సైట్స్ ప్రకారం ఈ సినిమా 11వ రోజున ఇండియాలో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

చందు ఛాంపియన్ సినిమా 11వ రోజున రూ. 1.75 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టగా.. 12వ రోజు దానికంటే కాస్తా వసూళ్లు పెరిగాయి. ఈ సినిమాకు 12వ రోజు రూ. 2 కోట్ల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి. దీంతో ఈ సినిమాకు మొత్తంగా 12 రోజుల్లో రూ. 53 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ కలెక్ట్ అయ్యాయి.

ఇక చందు ఛాంపియన్ సినిమాకు ఇండియాలో రూ. 60.65 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 71.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. భారతదేశపు తొలి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా చందు ఛాంపియన్‌కు విడుదలైన మొదటి వారంలో రూ.35.25 కోట్లు వసూలు అయ్యాయి. 8వ రోజు రూ. 2.65 కోట్లు, 9వ రోజు రూ. 4.85 కోట్లు, 10వ రోజు రూ. 6.5 కోట్లు, 11వ రోజు రూ. 1.75 కోట్లు రాబట్టింది.

ఇక చందు ఛాంపియన్ మంగళవారం మొత్తం 13 శాతం హిందీ ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అభిమానుల నుంచి విమర్శకుల వరకు, సినీ పరిశ్రమకు చెందిన వారు, ప్రేక్షకుల నుంచి కార్తీక్ ప్రశంసలు అందుకుంటున్నాడు. చందు ఛాంపియన్ ఒక దృఢమైన అథ్లెట్ స్ఫూర్తిదాయక కథను చెబుతుంది. చందు పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించగా.. సాజిద్ నడియాడ్ వాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్ మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ పతాకాలపై నిర్మించారు.

రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చందు ఛాంపియన్ జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో విజయ్ రాజ్, భువన్ అరోరా, రాజ్పాల్ యాదవ్, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలు పోషించారు. కాగా సోమవారం సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్‌లో పరిచయమైన పిల్లలతో వరుస వీడియోలు, ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్.

ఇది వెలకట్టలేని క్షణంగా హీరో కార్తీక్ ఆర్యన్ అభివర్ణించారు. "కొన్ని అమూల్యమైన ఆనంద క్షణాలు. థియేటర్లలో నిజమైన విజేతలతో సంభాషించడం సంతోషంగా, గర్వంగా ఉంది" అంటూ ఎమోజీ షేర్ చేశాడు చందు ఛాంపియన్ హీరో. దీంతో ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై నెటిజన్స్, కార్తీక్ అభిమానులు పలు విధాలుగా స్పందించారు.

'మీరు ఎక్కడికి వెళ్లినా చప్పట్లు, కేరింతలు నిరంతరం ఉంటాయి. మీ అద్భుతమైన ప్రదర్శనతో మీరు సంపాదించినది ఇదే' అని ఓ అభిమాని పేర్కొన్నారు. "ఈ రోజు, ఈ వారం మరిన్ని హౌజ్‌ఫుల్ షోలు వస్తాయని ఆశిస్తున్నాను" అని మరో నెటిజన్ ఆకాంక్షించారు.

WhatsApp channel