Heart Healthy Diet Plan | ప్రతిరోజూ ఈ సమయాల్లో భోజనం చేస్తే, మీ గుండె సేఫ్!
Heart-Healthy Diet Plan: మీకు ఎలాంటి గుండె జబ్బులు రాకుండా, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే అందుకు సరైన ఆహార ప్రణాళిక అవసరం. డాక్టర్లు సిఫారసు చేసిన సూచనలు ఇక్కడ తెలుసుకోండి.
Heart Health: గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. తద్వారా శరీరానికి ఆక్సిజన్, పోషకాల సరఫరాను చేయడంలో సహాయపడుతుంది. అయితే ఇటీవలకాలంలో గుండె సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనే వారు పెరిగారు. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాల రేటు పెరిగింది. అవిశ్రాంతంగా పనిచేసే గుండెకు మీరు తీసుకునే శ్రమనే చేయూతనందిస్తుందని వైద్యులు అంటున్నారు. చురుకైన జీవనశైలి (Active Lifestyle), ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల (Healthy Food Habits) ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని సూచిస్తున్నారు.
మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారం, మీరు అనుసరించే భోజన సమయాలు మీరు బరువు పెరగటానికి కారణం అవుతాయి. ఇది క్రమంగా మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగటం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. చివరకు గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను (Heart-Healthy Diet Plan) రూపొందించుకోవాలి. ఇందుకోసం వైద్యులు సిఫారసు చేసిన ప్రణాళికను ఇక్కడ చూడండి.
Everyday Diet- రోజూ ఇలాంటివి తినండి
- ఆకు పచ్చని కూరగాయలు
- తృణధాన్యాలు
- అవకాడోలు
- సాల్మన్ చేపలు
- అక్రోట్లు
- బీన్స్
- టమోటాలు
- బాదం
- విత్తనాలు
- వెల్లుల్లి
- ఆలివ్ నూనె
- గ్రీన్ టీ
Heart Healthy Meal Schedule- భోజన సమయాలు
On Empty Stomach- ఉదయం పూట 5 నుండి 6 గంట మధ్య సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో పాటు 5-6 బాదం పప్పులను తీసుకోండి.
Breakfast Time- అల్పాహారం సమయం
ఉదయం 7 నుండి 8 వరకు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి.
అల్పాహారంగా పోహా, ఉడకబెట్టిన పెసరిపప్పు, ఉప్మా, దోశ, పరాటా మొదలైన ఇంటిలో తయారు చేసిన ఉపాహారాలు తీసుకోండి. నూనె తక్కువగా ఉపయోగించండి. అలాగే ఒక గ్లాసు పాలు లేదా పెరుగు లేదా ఉడికించిన గుడ్డు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
Lunch Time - మధ్యాహ్న భోజనం సమయం
మీ మధ్యాహ్న భోజనంను ఉదయం 10 నుండి 11 వరకు పూర్తి చేయండి.
ఈ భోజనంలో నెయ్యి లేకుండా 2-3 చపాతీలు, లేదా మీడియం గిన్నె పరిమాణంలో అన్నం, ఒక కప్పు వెజిటేబుల్స్ కూర, చిన్న గిన్నె పెరుగు తినండి. మాంసాహారులైతే పప్పు స్థానలో చికెన్ లేదా చేపలను తినండి. భోజనంతో పాటు సలాడ్‌ను కూడా తినండి.
Tea Time Snacks- సాయంత్రం చిరుతిండి
సాయంత్రం 4 నుండి 5 వరకు వరకు ఏదైనా ఆరోగ్యకరమైన చిరుతిండి తినండి. ఇందులో భాగంగా ఒక గిన్నె సూప్ లేదా ఒక పండ్ల గిన్నె. లేదా ఒక చిన్న గిన్నె భేల్ / చాట్ కూడా తీసుకోవచ్చు. చిరుతిండితో పాటు ఒక కప్పు గ్రీన్ టీ లేదా కాఫీని కూడా తీసుకోవచ్చు.
Dinner Time - డిన్నర్
రాత్రి భోజనం రాత్రి 8 నుండి 9 వరకు పూర్తి చేయాలి.
మీ రాత్రి భోజనంలో 2 మల్టీగ్రెయిన్ చపాతీలు లేదా 2 జొన్నరొట్టెలు లేదా మిల్లెట్ రొట్టెలు, ఒక గిన్నె వెజిటబుల్ కర్రీ, ఒక ప్లేట్ సలాడ్, ఒక గిన్నె పప్పు లేదా పెరుగు తీసుకోండి. రొట్టెలు తినలేనపుడు, ఒక గిన్నె ఖిచ్డీ లేదా దాల్ రైస్ కూడా తీసుకోవచ్చు.
పైన పేర్కొన్న చిట్కాలతో పాటు ధూమపానం, మద్యం మానుకోండి. మీ ఒత్తిడిని నియంత్రించండి. ప్రతిరోజూ తగినంత నిద్రపోండి, రెగ్యులర్ హెల్త్ చెక్-అప్ చేసుకోండి. ఇలాంటి జీవనశైలిని కలిగి ఉంటే మీ గుండె సేఫ్.
సంబంధిత కథనం
టాపిక్