Oats Chat Recipe | ఓట్స్ చాట్.. ఎండలో ఆరోగ్యకరమైన చిరుతిండి!
Oats Chat Recipe: వేసవిలో సాయంకాలానా ఆకలి వేసినా చిరితిండిపై మనసు రావటం లేదా? అయితే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఓట్స్ చాట్ తినిచూడండిమ్ రెసిపీ ఇక్కడ ఉంది.
Oats Chat Recipe: (Unsplash)
Summer Recipes: వేసవి తాపం కొనసాగుతుంది, రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన వేడితో అనేక సమస్యలు వస్తాయి, అందులో ఆకలి తగ్గడం కూడా ఒకటి. చలికాలంలో ఎంతో రుచిగా ఉండే మసాలా కూరలు, వేపుళ్లు వేసవిలో చప్పగా రుచిపచీ లేనట్లుగా అనిపిస్తాయి. వేడివేడిగా ఏదైనా తినడానికి బదులు, చల్లచల్లగా నిమ్మరసం, పెరుగు, ఐస్ క్రీమ్, మజ్జిగ, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవాలనిపిస్తుంది.
ఈ వేసవి సాయంకాలాలలో ఇంట్లోనే చేసుకోగల రుచికరమైన, ఆరోగ్యకరమైన ఓట్స్ చాట్ రెసిపీని ఇక్కడ చూడండి.
Oats Chat Recipe కావలసినవి
- ఓట్స్ - 1 కప్పు
- పెరుగు - అర కప్పు
- ఉడికించిన తెల్లశనగలు - 1/4 కప్పు
- ఉడికించిన వేరుశనగలు - 1/4 కప్పు
- కార్న్‌ఫ్లేక్స్ - 1/4 కప్పు
- సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- సన్నగా టొమాటో ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- పుదీనా కొత్తిమీర చట్నీ - 2 tsp
- చింతపండు చట్నీ - 2 tsp
- నల్ల ఉప్పు - రుచికి తగినంత
- చాట్ మసాలా - రుచికి తగినంత
- నిమ్మరసం - 1 స్పూన్
- కొత్తిమీర - గార్నిషింగ్ కోసం
- దానిమ్మ గింజలు - అలంకరణ కోసం
ఓట్స్ చాట్ తయారీ విధానం
- ఒక పెద్ద గిన్నెలో పెరుగును, రోస్ట్ చేసిన ఓట్స్ కలపండి.
- ఆపైన కార్న్ ఫ్లేక్స్, ఉడికించిన చిక్పీస్ వేసి బాగా కలపాలి.
- అనంతరం దోసకాయ, టొమాటో ముక్కలు, ఉడికించిన వేరుశనగ, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం, గ్రీన్ చట్నీ, చింతపండు చట్నీ వేసి బాగా కలపాలి.
- చివరగా 1 స్పూన్ పెరుగు, తరిగిన కొత్తిమీర, దానిమ్మ గింజలతో గార్నిష్ చేయండి.
అంతే, ఓట్స్ చాట్ రెడీ.. సర్వ్ చేయండి. ఆనందించండి.
సంబంధిత కథనం