Soaked Peanuts । రోజూ ఉదయం నానబెట్టిన వేరుశనగలు తినండి, ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు!-eat a handful of soaked peanuts everyday in the morning to get amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eat A Handful Of Soaked Peanuts Everyday In The Morning To Get Amazing Health Benefits

Soaked Peanuts । రోజూ ఉదయం నానబెట్టిన వేరుశనగలు తినండి, ఆశ్చర్యపోయే ఆరోగ్య ప్రయోజనాలు!

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 07:07 AM IST

Soaked Peanuts Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

Soaked Peanuts Benefits
Soaked Peanuts Benefits (Pixabay)

Soaked Peanuts: వేరుశనగలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు 25.8 గ్రాముల ప్రొటీన్లను అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం. అలాగే వేరుశనగలలోని ఇతర పోషకాలు ఎముకల దృఢత్వానికి, చర్మ ఆరోగ్యం కోసం, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అయితే వేరుశనగలను నానబెట్టుకొని తినడం వలన వాటిలోని పోషక విలువలు మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

డైటీషియన్ల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం ఒక గుప్పెడు నానబెట్టిన వేరుశనగలను అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అలాగే ఎప్పుడైనా ఆకలివేసినపుడు గానీ, లేదా భోజనాల మధ్య కూడా వేరుశనగలను చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ఇలా నానబెట్టిన వేరుశనగలను సరైన సమయంలో తింటే, వాటిలోని పోషకాలు మన శరీరంలోకి పూర్తిగా శోషణ చెంది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Soaked Peanuts Health Benefits -నానబెట్టిన వేరుశనగలతో ప్రయోజనాలు

నానబెట్టిన వేరుశెనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.

కండరాల పెరుగుదల

వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశనగ కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది, కండరాల క్షీణతను నివారిస్తుంది. దృఢమైన శరీరాన్ని కోరుకునేవారు ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తినడం ప్రయోజనకరం. ఉదయం పూట వేరుశనగ మొలకలుగా కూడా చేసుకుని తినవచ్చు. ప్రోటీన్లతో పాటు, ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుందని మనందరికీ తెలుసు. వేరుశనగలో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశనగ ప్రయోజనాల్లో ఇది ఒకటి. నానబెట్టిన వేరుశనగలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, ఆసిడిటీ తగ్గుతుంది.

గుండె జబ్బులు దూరం

నానబెట్టిన వేరుశనగలు తినడం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండెను రక్షిస్తుంది. దీర్ఘకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. వేరుశనగ జీవక్రియను వేగవంతం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది

నానబెట్టిన వేరుశనగలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి, ప్రాణాంతక కణాలను శరీరంలో పెరగకుండా నివారిస్తాయి. వేరుశనగలో ఐరన్, ఫోలేట్, కాల్షియం , జింక్ ఉంటాయి, ఇవన్నీ క్యాన్సర్ కణాల అభివృద్ధిని మందగింపజేస్తాయి. వేరుశనగలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

వెన్నునొప్పి నుంచి ఉపశమనం

ఈరోజుల్లో చాలా మంది ఇంటి నుంచే పనిచేయడం, పెరిగిన పనిభారం కారణంగా అది శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజంతా కూర్చోవడం వలన వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. నానబెట్టిన వేరుశనగలను, బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది

వేరుశనగలో ఉండే విటమిన్లు కంటిచూపును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగను తినడం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

చర్మాన్ని సంరక్షిస్తుంది

వేరుశనగలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నానబెట్టిన వేరుశనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మానికి అద్భుతమైన మెరుపు వస్తుంది.

దగ్గు నుండి ఉపశమనం

వేరుశనగ శరీరానికి వెచ్చదనాన్ని, శక్తిని అందిస్తుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

అయితే వేరుశనగలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. ప్రోటీన్లు కూడా అధికంగా ఉన్నందున, ఇవి జీర్ణవ్యవస్థకు భారాన్ని కలిగించవచ్చు అందువల్ల రాత్రిపూట వాటిని తినకూడదని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం