DIY Garlic Oil । జుట్టు కుదుళ్ల పోషణకు వెల్లుల్లి నూనె, ఇలా తయారు చేయండి!-use garlic for your complete hair care solution here is diy garlic oil recipe for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Use Garlic For Your Complete Hair Care Solution, Here Is Diy Garlic Oil Recipe For You

DIY Garlic Oil । జుట్టు కుదుళ్ల పోషణకు వెల్లుల్లి నూనె, ఇలా తయారు చేయండి!

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 02:55 PM IST

DIY Garlic Oil: జుట్టు రాలడం అరికట్టడానికి, జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు, తలస్నానం చేయడానికి అన్ని రకాల జుట్టు సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారం. వెల్లుల్లి నూనె తయారీ, ఉపయోగించే విధానం చూడండి.

Garlic Oil for hair
Garlic Oil for hair (Pixabay)

Garlic for Hair: జుట్టు రాలడం, కొత్తజుట్టు పెరగకపోవడం, ఉన్న వెంట్రుకలు తెల్లబడటం, చుండ్రు మొదలైనవి ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్యలు. జీవితంలో ఇప్పటికే ఉన్న ఆందోళనకు తోడు, ఈ జుట్టు సమస్యలు మరింత ఆందోళనకు గురిచేస్తాయి. ఈ ఆందోళన జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. దీనిని అరికట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఖరీదైన ఉత్పత్తులతో పాటు, ఇంటి వద్ద కూడా పలురకాల నివారణ మార్గాలను ప్రయత్నించి చూస్తారు. జుట్టు పెరుగుదల కోసం చాలా మంది ఉల్లిరసం లేదా ఉల్లినూనెను ఉపయోగిస్తారు. ఇది ప్రభావవంతమైన చిట్కానే అయినప్పటికీ అందరి జుట్టు రకాలకు ఇది పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వెల్లుల్లిని కూడా ఉపయోగించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

భారతీయ వంటలలో వెల్లుల్లిని చాలా శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది కేవలం ఆహార పదార్థంగానే కాక, ఔషధ గుణాల కోసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రమోటర్లు. మీ జుట్టు సంరక్షణ నియమావళిలో వెల్లుల్లిని చేర్చుకోండి. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే జింక్, కాల్షియం, సల్ఫర్, యాంటీ-ఆక్సిడెంట్లు స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే కెరాటిన్, Vitamin B6 మొదలైన విటమిన్లు కొత్త వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి. వెల్లుల్లి నూనెతో మీ స్కాల్ప్‌ను మసాజ్ చేయడం వల్ల మీ జుట్టు మూలాలు బలపడతాయని చెబుతారు.

DIY Garlic Oil - వెల్లుల్లి నూనెను ఎలా తయారు చేయాలి?

వెల్లుల్లి నూనెను (Homemade Garlic Oil) తయారు చేసేందుకు 8 వెల్లుల్లి రెబ్బలు, అర కప్పు ఆలివ్ ఆయిల్, 1 ఉల్లిపాయ అవసరం.

ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి, మెత్తని పేస్ట్‌లా చేయండి

ఇప్పుడు ఒక పాన్‌లో అరకప్పు ఆలివ్ ఆయిల్ వేడి చేయండి. అందులో వెల్లుల్లి-ఉల్లిపాయ పేస్ట్ వేసి మీడియం మంట మీద వేయించాలి. పేస్ట్ గోధుమ రంగులోకి మారినప్పుడు, వేడిని ఆపివేసి చల్లబరచండి.

చల్లారిన తర్వాత బాగా ఫిల్టర్ చేసి నూనెను వేరు చేయండి. ఈ నూనెను (Garlic Olive Oil) తలకు బాగా పట్టించాలి. నూనెను తలకు పట్టించి 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఈ నూనెను వారానికి 3-4 రోజులు వాడండి. దీంతో జుట్టు రాలడం (Hair fall) తగ్గుతుంది. ఇతర జుట్టు సమస్యలు పరిష్కారం అవుతాయి.

కొబ్బరి నూనెతో మెత్తగా తరిగిన వెల్లుల్లిని మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని (Garlic Coconut Oil) కూడా మీ తలపై మసాజ్ చేసుకోవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. మీ జుట్టు మరింత బలమైన ఫోలికల్స్ కలిగి దృఢంగా మారుతుంది. జుట్టు పెరుగుదలను (Hair Growth) ప్రోత్సహిస్తుంది.

షాంపూ చేసుకునే ముందు కూడా మీరు జుట్టుకు వెల్లుల్లి వాడవచ్చు. పచ్చి వెల్లుల్లిని మెత్తగా నూరి, మీ జుట్టుకు అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆపై షాంపూతో కడిగి శుభ్రం చేసుకోండి. వెల్లుల్లిలోని సల్ఫర్ ఆస్ట్రింజెంట్‌గా పని చేస్తుంది, ఇది (Garlic Shampoo Treatment) తలలోని సహజ నూనెలను తొలగించకుండా, స్కాల్ప్‌ను డీప్ క్లీన్ చేసి తలలో పేరుకున్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం