Almond Hair Oil । మీది ఎలాంటి జుట్టు అయినా.. చిక్కుముడులన్నింటికీ పరిష్కారం బాదాం నూనె!
Almond Hair Oil: మీ జుట్టుకు ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలో తెలియడం లేదా అయితే బాదాం నూనె వాడండి. ఇది అన్ని రకాల జుట్టుకు ప్రయోజనాలు కలిగిస్తుంది. బాదాం నూనె వాడితే జుట్టుకు ఎలాంటి మేలు ఉంటుందో చూడండి .
జుట్టు సంరక్షణ కోసం మనకు అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అందమైన, ఆరోగ్యమైన జుట్టును పొందడం కోసం మీరు ఇప్పటివరకు ఖరీదైన షాంపూలు మొదలుకొని, ఇంట్లోనే చేసుకోగల పాత తరం హెయిర్ ప్యాక్ ఐడియాల వరకు అన్నింటినీ ప్రయత్నించి ఉండవచ్చు. కానీ, ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఏదో ఒక అసంతృప్తి మిమ్మల్ని వెంటాడవచ్చు.
మీ జుట్టు సంరక్షణలో భాగంగా మీ జుట్టు నల్లగా, ఒత్తుగా (Black Thick Hair) పెరగాలంటే.. జుట్టు రాలడం తగ్గాలంటే అందుకు సరైన పోషణ ఇవ్వాలి. మీరు తలకు ఉపయోగించే నూనెలతోనే మీ జుట్టుకు పోషణ లభిస్తుంది. అయితే తమ జుట్టుకు ఏ నూనె వాడాలి అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే వివిధ నూనెలు వివిధ జుట్టు రకాలపై విభిన్నంగా పనిచేస్తాయి. అయితే వీటన్నింటిలో బాదం నూనె (Almond Hair Oil) అన్ని జుట్టు రకాలకు సరిపోతుంది. కాబట్టి తమది ఎలాంటి జుట్టు రకం అయినా, బాదాం నూనె ఉపయోగించవచ్చు. తద్వారా మీ జుట్టుకు వివిధ రకాల ప్రయోజనాలు చేకూర్చువచ్చు. బాదాం నూనె వాడటం వలన మీ జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడండి.
జుట్టుకు సహజమైన కండిషనింగ్ ఏజెంట్
తమ జుట్టు కోసం చాలా మంది కండిషనర్లు ఉపయోగిస్తారు. అయితే రసాయనాలు కలిగిన ఈ కండిషనర్లు జుట్టు నాణ్యతను నాశనం చేస్తాయి. బాదం నూనె ఉపయోగిస్తే, ప్రత్యేకంగా కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే మీ జుట్టును తేమగా, సున్నితంగా మార్చగల సహజమైన కండిషనింగ్ ఏజెంట్. బాదాం నూనెలో ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉన్నందున, దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మీ జుట్టుకు ఎలాంటి హాని లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
బాదం నూనెలో విటమిన్లు A, E , D వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహజ జనరేటర్లు. వెంట్రుకల కుదుళ్లకు విటమిన్ డి అవసరం. జుట్టు డ్యామేజ్‌ని నివారించడానికి విటమిన్ ఇ అవసరం. పెరుగుదల విటమిన్ ఎ అవసరం ఈ మూడూ బాదాం నూనెలో ఉన్నాయి. అదనంగా బాదాం నూనెలో ఉండే అధిక మెగ్నీషియం స్కాల్ప్ ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
చుండ్రును తగ్గిస్తుంది
చాలా మంది తరచుగా చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే బాదం నూనె చుండ్రుకు గొప్ప పరిష్కారం. ఈ నూనెలో ఉండే యాంటీ ఫంగల్ గుణాల కారణంగా, ఇది చుండ్రుకు కారణమయ్యే ఫంగల్ మూలకాన్ని నాశనం చేస్తుంది. చుండ్రు మాయమవుతుంది.
స్కాల్ప్ ఇరిటేషన్ నివారిస్తుంది
మీరు తరచుగా తల గోక్కునే వారైతే, మీకు తలలో ఎల్లప్పుడూ దురదగా అనిపిస్తేయ్, బాదం నూనెను ఉపయోగించండి. సహజమైన బాదం నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా, ఇది స్కాల్ప్ ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సంబంధిత కథనం