Marigold Flower for Hair । జుట్టు పెరగాలన్నా, చుండ్రు పోవాలన్నా.. బంతిపువ్వును ఇలా వాడండి!
Marigold Flower for Hair: బంతిపువ్వులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు సంరక్షణకు ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు బంతిపువ్వును ఉపయోగించే DIY Hair Care విధానాలు తెలుసుకోండి.
Marigold Flower Benefits: ఈ ప్రకృతిలో పువ్వులు ఎంతో ప్రత్యేకమైనవి. అవి అందమైన రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, మంచి సువాసనలు వెదజల్లుతూ మనసుకు ఓదార్పునిస్తాయి. అలంకరణలు మొదలుకొని ఆరాధన వరకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు కొన్ని పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాంటి అద్భుతమైన పువ్వులలో బంతిపువ్వు కూడా ఒకటి.
ముద్దబంతి పువ్వులు ముచ్చటైన పసుపు రంగులో ఎంతో అందంగా ఉంటాయి. ఈ పువ్వులు సహజ నూనెలు, పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి మన దైనందిన జీవితంలో అనేక సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా జుట్టు సంరక్షణ కోసం, చర్మ సంరక్షణ కోసం బంతిపూలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి.
బంతి ఆకులను హెయిర్ మాస్క్‌లుగా (Hair Mask) తయారు చేసుకోవచ్చు, బంతిపూల నుండి తీసిన నూనెను జుట్టు పెరుగుదలకు ఉపయోగించవచ్చు. చుండ్రును నివారించటానికి వాడుకోవచ్చు. బంతి పువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలను , వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపే DIY Hair Care విధానాలను ఇక్కడ తెలుసుకోండి.
Marigold Flower For Hair Growth - జుట్టు పెరుగుదలకు బంతిపువ్వు
మీరు జుట్టు బాగా పెరగాలని కోరుకుంటే బంతిపువ్వు నూనెను ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటి వరకు ప్రయత్నించిన అనేక హెయిర్ ఆయిల్‌ల కంటే కూడా బంతిపువ్వు ఆయిల్ మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. ఇది జుట్టు రాలడం ఆపి వెంట్రుకలు పెరుగుదలకు, రాలిపోయిన వెంట్రుకలు తిరిగి పెరగటానికి రెండింటికీ అవసరమయ్యే కొన్ని ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ నూనెను మీ తలకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది, కేవలం రెండు వారాలలో కనిపించే ఫలితాలు కనిపిస్తాయని నివేదికలు పేర్కొన్నాయి. బంతిపువ్వు నూనెను మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు, ఎలాగో ఈ కింద చూడండి.
DIY Marigold Flower Hair Oil- జుట్టు పెరుగుదలకు
- కొన్ని బంతి ఆకులను సేకరించి శుభ్రంగా కడగండి.
- ఆ తర్వాత ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఏదైనా తీసుకోండి.
- ఇప్పుడు ఆ నూనెలో బంతి పువ్వు ఆకులు వేసి 10-15 నిమిషాలు చిన్న మంట మీద వేడిచేయండి.
- ఆపై గిన్నెను మంట నుంచి తీసేసి, నూనెను చల్లారనివ్వాలి.
- ఆపై ఈ నూనెను ఫిల్టర్ చేసి కంటైనర్‌లో నిల్వ చేయండి.
మీకు అవసరం అయినపుడు ఈ నూనె రాసుకోండి.
DIY Marigold Flower Water - జుట్టు రాలడం అరికట్టడానికి
మీరు రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకుంటారో అదే తరహాలో బంతిపువ్వులతో మేరీగోల్డ్ వాటర్ తయారు చేయవచ్చు. ఇది మీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. మీరు దీర్ఘకాలికంగా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటుంటే, జుట్టు రాలడాన్ని నివారించడానికి మీ జుట్టును బంతిపువ్వు నీటితో కడగండి. Hair fall preventing మేరీగోల్డ్ వాటర్ ఇలా తయారు చేయండి.
రెండు కప్పుల నీటిలో, ఒక కప్పు బంతి పువ్వు రేకులను కలపండి
ఈ నీటిని సగానికి తగ్గించే వరకు 15 నిమిషాలు తక్కువ మంటపై మరిగించండి.
అనంతరం చల్లారే వరకు వేచి చూడండి, మేరీగోల్డ్ వాటర్ రెడీ
షాంపూ చేసుకున్న తర్వాత మీ జుట్టును శుభ్రం చేయడానికి ఈ మేరిగోల్డ్ నీటిని ఉపయోగించండి.
DIY Marigold Flower Fusion Spray - చుండ్రు నివారణకు
చుండ్రు అనేది నెత్తిమీద మంట, దురద కలిగించే ఒక పరిస్థితి. తెల్లని పొలుసులు రాలే ఈ చుండ్రు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చుండ్రు నివారణకు ఇప్పటికే అనేక రకమైన రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటితో ఫలితం లేదనుకుంటే ఈ బంతివువ్వు ఫ్యూజన్ ప్రయత్నించండి.
- రాత్రి పడుకునే ముందు మీ తలకు మేరిగోల్డ్ ఆయిల్ మసాజ్ చేయండి.
- మరుసటి రోజు బంతి పువ్వు నీటితో మీ జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ రెండింటి కలయిక మీ జుట్టుపై క్లెన్సింగ్, యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను చూపుతాయి. మీ స్కాల్ప్ నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చుండ్రును క్రమంగా తగ్గించడానికి స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది, ఇంకా పోషణ చేస్తుంది. కొన్ని వారాలలో ఆరోగ్యకరమైన మెరిసే జుట్టును సొంతం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం